జాషువా సాంస్కృతిక వేదిక మరో 10 కళాసంస్థల సంయుక్తంగా విజయవాడ బాలోత్సవ్ భవన్ లో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన అనేక మంది చిత్రకళా ప్రియులను ఆకట్టుకుంది. ఉభయ రాష్ట్రాల నుంచి 42 మంది చిత్రకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనను జిజ్ఞాస ఇంటర్ ఫేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వై. భార్గవ్ ప్రారంభించగా ప్రముఖ రచయిత సుబ్బు ఆర్వీ, ప్రముఖ చిత్రకారుడు అరసవిల్లి గిరిధర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ టెక్నాలజీ, కళలు భవిష్యత్ లో మిళితం అవుతాయని, అందుకు అనుగుణంగా చిత్రకారులు సమయానుకూలంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సభకు అధయక్షత వహించిన ఏ. సునీల్ కుమార్ మాట్లాడుతూ కళల గురించి జాషువా సాంస్కృతిక వేదిక అనేక కార్యక్రమాలను నిర్వహించింది అనీ, భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలను చేనట్టనుందని చెప్పారు. 64 కళలు డాట్ కామ్ ఎడిటర్ కళాసాగర్ మాట్లాడుతూ కళాకారులందరూ కలసికట్టుగా పనిచేయాలని, అప్పుడే మన ఉనికిని కాపాడుకొని, మన కళకు గుర్తింపుని తెచ్చుకోగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్రకళను నిర్లక్ష్యం చేస్తుందని, వివిధ రంగాలకు అకాడెమీలు ఏర్పాటుచేసినా, నిధులు లేని అకాడెమీలు నిస్ప్రయోజనం మన్నారు.
అనంతం యువ రచయిత సుబ్బు ఆర్వీ మాట్లాడుతూ కళలు శాశ్వతం-కళాకారులు అజరామరమని కళాకారులు యొక్క కృషిని కొనియాడారు.
ఈ చిత్రకళా ప్రదర్శనలో ప్రజల జీవన విధానాన్ని అనేక విధాలుగా చిత్రించిన చిత్రకారులను అతిథులు అభినందించి ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను అందజేశారు.
స్ఫూర్తి శ్రీనివాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా గుండు నారాయణరావు చిత్రకళా ప్రదర్శనను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో
ఫోరమ్ ఫర్ ఆర్టిస్టు,
64 కళలు డాట్ కామ్
చిత్రం ఆర్ట్ ఇన్స్టిట్యూట్
విజయవాడ ఆర్ట్ సొసైటీ
ఆర్ట్ మేట్ ది స్కూల్ ఆఫ్ ఆర్టిస్ట్
డమరుకం లలిత కళాసమితి
డ్రీమ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ
స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ
క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
అకాడమీ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్
సంస్థల తరపున చిత్రకారులు పాల్గొన్నారు.
–మల్లికార్జునాచారి