27వ అంతర్జాతీయ ఉగాది రచనల పోటీ

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 27వ అంతర్జాతీయ స్థాయి ఉగాది ఉత్తమ రచనల పోటీ

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2022)

గత 27 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “శుభకృతు” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం:

భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: US116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: US$116

“మొట్టమొదటి రచనా విభాగం” – ప్రపంచ వ్యాప్తంగా

కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ”లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

“నా మొట్టమొదటి కథ”: (ఉత్తమ కథ): US$116

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): US$116

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు:

ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించ వచ్చును. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. చేతివ్రాతలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే.

తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.

రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.

బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.

విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (ఏప్రిల్ 1, 2022) కాని, అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.

విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్ & హైదరాబాద్ (Phone: 832 594 9054)
E-mail: vangurifoundation@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap