చరిత్ర సృష్టించనున్న “ఉప్పెన”

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఆ డీ సంగీత ప్రియులను అలరిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. విలేజ్ బాక్టాప్ లో ప్యూర్ లవ్ స్టోరీగా హై ఎమోషన్స్ తో రూపొందిన “ఉప్పెన” చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక సినీ ప్రముఖులు, మెగా అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ చిత్రంలోని ఒక్కోపాటను ఆవిష్కరించారు.. “ఉప్పెన” న్యూ ట్రైలర్ ను హరీశ్ శంకర్ రీ లాంచ్ చేశారు.
ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లలో విడుదలయిన “ఉప్పెన” ఫస్ట్ టికెట్ ను మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు… అనంతరం ఈ కార్యక్రమంలో….

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..
“ఏ సినిమా అయినా రిలీజ్ అయిన రెండు, మూడు రోజులకు ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది.. కానీ రిలీజ్ కి ముందే హిట్ అని కొన్ని సినిమాలు తెలుస్తాయి.. అందులో ఒకటి “ఉప్పెన”. ఇది ఈవెంట్ లా లేదు.. సక్సెస్ మీట్ లా ఉంది. యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ఇంత బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అవుతాడు. సుకుమార్ నుంచి ఇంకా చాలా మంది డైరెక్టర్స్ వస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు తీయబోతున్నారు. ఇండియాలో బిగెస్ట్ బ్యానర్ గా ట్రావెల్ కానుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచేవిధంగా సినిమాలు చేస్తున్నారు. నవీన్, రవి వెరీ ఫ్యాషనెట్ ప్రొడ్యూసర్స్.. వారి జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. ఉప్పెన సినిమాని చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడే నాకు సినిమా చూపించాడు. అప్పుడు నాకు ఆనందం, ఈర్ష కలిగాయి.. అంత గొప్ప కథతో ఈ సినిమా తీశాడు. వైష్ణవ్ తేజ్, కృతి అన్బిలివబుల్ పెర్ఫార్మెన్స్ చేశారు అన్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ..
‘లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ చేస్తే ఆ కిక్కే వేరు. ప్యూర్ లవ్ స్టోరీ ఉప్పెన సినిమాకి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్ అమేజింగ్ గా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కసితో చేశాం. అంత ఇంపాక్ట్ ఉన్న కథ ఇది. వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ లెంట్ గా చేశాడు. టైట్ ఫ్యూచర్ ఉంటుంది. కృతి ఎక్స్ ట్రార్డినరిగా చేసింది. చంద్రబోస్, శ్రీమణి బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. గ్యారెంటీగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు. హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ నా జీవితంలో ఒక స్పెషల్ డే. చిరంజీవి గారు మాకు ఇన్స్పిరేషన్. సుకుమార్ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ నా మనసులో దాచుకున్నాను. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇంత బాగా నటించానంటే ఆ క్రెడిట్ బుచ్చిబాబుకే దక్కుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ..
‘ఘరానా మొగుడు’ సినిమా చూడాలని ప్రతిరోజు నేను, మా అన్న థియేటర్ కి వెళ్ళేవాళ్ళం. టికెట్స్ దొరికేవి కావు. అలా 75రోజులు దాకా వెయిట్ చేశాం. అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారిని కలిసి నాలుగు గంటలపాటు కథ చెప్పి నెరేషన్ ఇవ్వడం నా జీవితంలో మర్చిపోలేను. ఆయన చెప్పిన మాటలు, ఇన్పుట్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సుకుమార్ గారు నాకు లెక్కలు చెప్పకపోతే నేను ఇక్కడిదాకా వచ్చేవాడ్ని కాదు.. ఎక్కడో.. ఏదో ఓ పని చేసుకునేవాడ్ని, సుకుమార్ గారివల్లే నేను డైరెక్టర్ ని అయ్యాను. ఉప్పెన కథ ఎలా రాశానో అలాగే తీయడానికి మైత్రీ నవీన్, రవి గారు కారణం. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను సినిమాని బాగా తీయగలిగాను అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..
‘ఉప్పెన ‘ సినిమా చూశాక అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంత గొప్పగా సినిమా ఉంది. అద్భుతమైన దృశ్యకావ్యంలా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. నేను కరేషన్ చెప్పడానికి అందులో ఏమీలేదు. కథ చెప్పినదానికంటే గొప్పగా ఎమోషన్స్ సీన్స్ అన్నీ కట్టిపడేసేలా ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా చిత్రీకరించారు. స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా చూశాక స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అంతలా కొత్తగా వచ్చే డైరెక్టర్స్, అందరికీ ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. స్క్రీన్ ప్లే కి పర్ఫెక్ట్ ఎగ్జామ్ ఫుల్ గా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూశాక నాకు 80, 90 దశకంలో భారతీ రాజా గారు తీసిన సినిమాలు గుర్తుకువచ్చాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్స్ లో మట్టికథలతో ఆయన గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి మన మట్టి కథలు రావాలి. ఇది మన కథ.. మన నేటివిటీ ఉన్న ప్రేమకథ అని ఉప్పెన రుజువు చేస్తుంది. అంత గొప్ప సినిమా చేసిన బుచ్చిబాబు ని అభినందిస్తున్నాను. ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్న విజయ్ సేతుపతి వెర్సటైల్ యాక్టర్. కొత్త వారిని సపోర్ట్ చేసి ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ లో నటించాడు. ఆయన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక పక్క హీరోగా చేస్తూ.. మరో పక్క ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ చేస్తున్న విజయ్ కి హ్యాట్సాప్. కృతి శెట్టి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది.. అత్యద్భుతంగా నటించిన వైష్ణవ్ తేజ్ మా మెగా ఫ్యామిలీకి నాకు గర్వకారణం. మా తేజ్ కి మంచి భవిష్యత్ ప్రసాదించాలని భగవంతుడుని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టీమ్ అందరికీ అభినందనలు.
అనతి కాలంలోనే మైత్రీ మూవీస్ నంబర్ వన్ సంస్థగా ఎదిగింది. మైత్రీ బ్యానర్ లో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు. నాతో కూడా బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. అందరి సమిష్టి కృషితో తెరకెక్కిన ఉప్పెన చిత్రం ప్రతీ ఒక్కరిని అలరించి వారి మన్నలను పొందుతుంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap