వపా అభిమానులకు విజ్ఞప్తి….!

వపా అభిమానులకు కానుక …! వపా శతవసంతాల ప్రత్యేక సంచిక…!
అమర చిత్రకారుడు, కార్టూనిస్ట్, రచయిత వడ్డాది పాపయ్య శతజయంతి సంవత్సరం (1921-2021) సెప్టెంబర్ 10న ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ‘వపా ‘ కు ‘వంద ‘నం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు సంవత్సరం పాటు (2021 సెప్టెంబర్-10 వరకు) నిర్వహించతలిచాము. వేలాదిగా వున్న వపా అభిమానులు ఈ కార్యక్రమానికి సహకరించవలసినదిగా కోరుచున్నాం. వపా కు సంబంధించిన చిత్రాలు, కార్టూన్లు, కథలు, వ్యాసాలు మాకు పంపించ కోరుతున్నాం.
కార్యక్రమ వివరాలు:
1. వపా శతవసంతాల ప్రత్యేక సంచిక ముద్రణ
2. వపా కార్టూన్లు ప్రచురణ
3. వపా కథలు ప్రచురణ
4. వపా చిత్రకళా ప్రదర్శన (ఒరిజినల్స్) ఏర్పాటు
5. వపా స్మారకోపన్యాసం ఏర్పాటు
6. వపా విగ్రహం ఏర్పాటుకు (విశాఖపట్నంలో) కృషి
7. వపా ఆర్ట్ గ్యాలరీ కి యత్నం
పై కార్యక్రమాలు జయప్రదం కావడానికి వపా అభిమానులు తగిన సూచనలు, సలహాలు అందజేయాల్సిందిగా కోరుతున్నాం.
సుంకర చలపతిరావు
చిత్రకళా పరిషత్, విశాఖపట్నం(91546 88223)

కళాసాగర్ యల్లపు
ఎడిటర్ :64కళలు.కాం (98852 89995)
email: artistkalasagar@gmail.com

12 thoughts on “వపా అభిమానులకు విజ్ఞప్తి….!

  1. చిత్రకారుల స్వప్నం నెరవేరాలని కోరుకుంటున్నాను.
    సదా.
    ప్రేమతో
    శ్రీనివాస్ కట్టిబోయిన.

  2. మంచి ప్రయత్నం….
    ఈ ప్రయత్నం సఫలమైతే ఎందరికో స్ఫూర్తి గా ఉంటుంది…..
    ఈ పనిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా….అభినందనలు….
    …… శ్రీనివాస్ బీర. ఆర్టిస్ట్.

  3. మన అదృష్టం కొద్దీ వపా గారి సమకాలీనులుగా పుట్టి
    . వారిని అనుకరించి, అనుసరించి, చిత్రకారులుగా బ్రతికాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కంటే జీవన పరమావధి ఏముంటుంది చలపతిరావు గారు. వారి అనుగ్రహంతో తప్పక ఇందులో పాలుపంచుకుంందాం ధన్యులమవుదాం.

  4. వపా గారి చిత్రకళా తోరణం పుస్తక రూపంలో తీసుకురావడం మంచి నిర్ణయంతో కూడిన భగీరథ ప్రయత్నం.
    కొసనా భాస్కరరావు.

  5. వపా గారి చిత్రకళా తోరణం పుస్తక రూపంలో తీసుకురావడం మంచి నిర్ణయంతో కూడిన భగీరథ ప్రయత్నం.
    కొసనా భాస్కరరావు.

  6. వడ్డాది పాపయ్య గారి శతజయంతి సందర్భంగా వారి అద్భుత దృశ్యమాలికలు ఒక పుస్తకం గాతేవటం మా బోంట్ల కల , అది త్వరలో నెరవేరబోతుందని ఆనందిస్తున్నాను

  7. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులూ మనందరి రంగుల రారాజు శ్రీ శ్రీ శ్రీ వడ్డాది పాపయ్య గారి జీవన సంకలనాన్ని ‘ చిత్రకళా తోరణం’ పుస్తకరూపం లో రాబోతుండడం మా అదృష్టం ,ఇందులో భాగస్వామ్యులవ్వగలగడం మరొక ‘అదృష్టం’ ఈ అదృష్టాన్ని మాకందించబోతున్న పూజ్యులు శ్రీ సుంకర చలపతి రావు గారికి మనఃస్సుమాంజలులు,ధన్యవాదాలు…..

  8. Laudable programme. Hope it would inspire the present generation as earlier.
    I sincerely wish all your initiatives nd efforts a grand success.

  9. యువత కు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap