వడ్డాది పాపయ్య తెలుగు వారికి సుపరిచితుయిన పేరు. నాటి చందమామ, యువ పత్రికల నుండి స్వాతి పత్రిక వరకు నేటికీ వన్నె తరగని తన చిత్రాల ద్వారా కళాభిమానులను అలరిస్తున్నారు. సెప్టెంబర్ 10 న, 2020 రంగుల రారాజు వడ్డాది పాపయ్య గారి జన్మదిన సందర్భంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన నిర్వహించనుంది.
ఈ పోటీలో వడ్డాది పాపయ్య గారి చిత్రాలను రీ-ప్రొడక్షన్ (రంగుల్లో గాని రేఖాచిత్ర రూపంలో గాని) లేదా వడ్డాది పాపయ్య గారి పోట్రయిట్ అయినా వేయవచ్చు.
మీ చిత్రాలను సెప్టెంబర్ 8 లోపు క్రింది ఇచ్చిన గూగుల్ ఫారం లింక్ లో మీ వివరాలతో అప్లోడ్ చేయాలి.
https://forms.gle/FsBmPp8ssfSh7JGC9
‘వపా ‘ పుట్టిన రోజైన సెప్టెంబర్ 10 న ఫేస్బుక్ లో ఈ చిత్రాల ప్రదర్శన వుంటుంది.
మరిన్ని వివరాలకు క్రింద చూడండి…
Excellent