
‘గీతలు-రాతలు’ పేరుతో తను గీసిన కార్టూన్లతో…, నఖచిత్రాలతో…, తను రాసిన కథానికలతో… ఒక చక్కని పుస్తకం ప్రచురించారు వందన శ్రీనివాస్.
వృత్తి రీత్యా గత 39 సంవత్సరాలుగా డెక్కన్ క్రానికల్, వైజాగ్ ఎడిషన్ లో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్, ప్రవృత్తి కార్టూన్లు, నఖచిత్రాలు గీయడం, కథానికలు రాయడం. అంత బిజీగా వుంటూ కూడా కార్టూన్లు వేయడం, రచనలు చేయడం సామాన్యమైన విషయం కాదు. గత రెండు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న శ్రీనివాస్ అనేక పత్రికలలో కార్టూన్లు గీస్తూ, పలు కార్టూన్ పోటీల్లో బహుమతులు పొందారు. ముఖ్యంగా ‘తలిశెట్టి రామారావు’ ఆవార్డు 2022 అందుకున్నారు.
శ్రీనివాస్ కార్టూన్లు కూడా ఎంతో అర్థవంతంగా మంచి హ్యూమర్ తో, మంచి సెటైర్ తో వుంటాయి. శ్రీనివాస్ గారి గొప్ప తనం ఏమిటంటే..ఇంత బిజీగా వుంటూ కూడా రెగ్లులర్ గా కార్టూన్ గీయడం. తన కార్టూన్స్ లో సింపుల్ లైను, లైను చాలా బోల్డుగా వుంటుంది, క్యాప్షన్ చాలా చిన్నదిగా వుంటుంది. ఓవరాల్ గా కార్టూన్ చాలా స్ట్రయికింగ్ గా అనిపిస్తూ వుంటుంది. ఎక్కువ బ్యాక్ గ్రౌండు లేకుండా తక్కువ లైన్స్ తో మెయిన్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ రెండు మూడు లైన్స్ క్యాప్షన్ తోనే తన కార్టూన్స్ వుంటాయి. అలానే క్యాప్షన్ కూడా పేరాగ్రాఫ్ లు, నాలుగైదు లైనులు కాకుండా చాలా క్రిస్ప్ గా వుంటాయి. అలాంటి కార్టూన్స్ వెంటనే రీడర్స్ కి స్ట్రయిక్ అవుతాయి. క్యాప్షన్ చాలా ఎక్కువగా వున్న కార్టూన్స్ ని ఒక్కొక్కసారి రీడర్స్ ఎవైడ్ చేయవచ్చు. హ్యూమర్, సెటైర్ లు నిండివుంటాయి శ్రీనివాస్ కార్టూన్స్ లో. ఈ పుస్తకంలో ఒక కార్టూన్ గురించి చెప్పుకోవాలి, ఒక వైఫ్ అండ్ హజ్బెండ్.. భర్త గుర్రుపెట్టి నిద్రపోతుంటాడు, భార్య అతనిని లేపి ‘అరే మీరు ఈ రోజు నిద్రమాత్రలు వేసుకోవడం మరచిపోయారు..’ అని భర్తని తట్టి లేపుతూ వుంటుంది. అది అల్టిమేట్ హ్యూమరు. శ్రీనివాస్ కార్టూన్లలో కంపోజింగ్ కూడా బాగుంటుంది. అంత డీప్ గా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఆ రెండు మెయిన్ క్యారెక్టర్స్ ని కంపోజింగ్ చేసే విధానం కూడా చాలా ఎట్రాక్టివ్ గా వుంటుంది. ఈ పుస్తకంలో పేజీకి ఆరు కార్టూన్లు చొప్పున సుమారు 350 కార్టూన్లు వున్నాయి.
బోనస్ గా నాలుగు కథలు, నాలుగు పేజీల్లో నఖచిత్రాలు వున్నాయి. 98 పేజీల్లో A4 సైజులో ఆర్ట్ పేపర్ పై అందంగా ముద్రించారు ఈ పుస్తకం. కార్టూన్ అభిమానులు.. హాస్యప్రియులు తప్పక దాచుకోవాల్సిన పుస్తం ‘గీతలు-రాతలు’.
–కళాసాగర్ యల్లపు
ప్రతులకు: ‘గీతలు-రాతలు’
పేజీలు: 98, వెల: 550/-
మొబైల్: 99891 98970