చిత్రకళా ప్రదర్శన తేది: 26, ఏప్రిల్ 2026 (ఆదివారం)
*చిత్రకళా ప్రదర్శన స్థలం: విజయవాడ, ఉదయం 10.00 గం. ల నుండి సాయంత్రం 4.00 వరకు
*చిత్రాల సైజ్: రెండు X రెండున్నర అడుగులు.
*చిత్రాలకు ఇతివృత్తం: స్వాత్రంత్య పోరాటంలో వందేమాతర నేపథ్యం & ప్రభావం.
*6 చరణాల ఆధారంగా లేదా వాటిలోని పదాల నుండి స్ఫూర్తినిచ్చేలా ఉండాలి.
*ఈ చిత్రాలు ఆ తర్వాత కాలంలో ప్రధాన నగరాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది.
- మీ పేరును మార్చి 10వ తేదీ లోపు క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ లో నమోదు చేసుకోవాలి.
- మీ పెయింటింగ్ పూర్తి కాగానే ఏప్రియల్ 10వ తేదీ లోపు మీ పెయింటింగ్ “ఇమేజ్” మాకు పంపవలెను (అభినందన పత్రంలో ప్రింటింగ్ కోసం).
కావున సుమారుగా 30 రోజులు సమయం ముందుగా ఇవ్వడం జరుగుతుంది.
వ్యవస్థ ఏర్పాటు చేయుటకు మీ నుండి ఇటువంటి సమాచారం అందుతుండాలి. సంస్థకు సౌకర్యంగా ఉంటుంది.
కార్యక్రమం రోజున: మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్పాహారము, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ తో సహా అన్ని సంస్థ ఏర్పాటు చేస్తుంది. - సాయంత్రం మీకు జరిపే ఆత్మీయ సత్కారంలో మీ ఫోటో, మీ పెయింటింగ్ ఫోటో రెండు కలిపి అభినందన పత్రంలో ప్రింటింగ్ వేసి మీకు ఇవ్వబడుతుంది.
- ఇక్కడ మనం మన భావవ్యక్తీకరణ చిత్రాలతో పరిచయం అవుతాము.
- స్వాతంత్ర్య ఉద్యమం ఇతివృత్తం గురించి, చిత్రాలు భావం వ్యక్తీకరించడానికి ఏ విధమైనటువంటి సింబల్స్, ఏ విధంగా చిత్రాన్ని రూపొందించాలి అనే విషయాల పట్ల అవగాహన కార్యక్రమం ఉంటుంది.
ముందు రోజునే ఎవరైనా వస్తే వారికి వసతి ఏర్పాటు చేయబడును.
ఈ కార్యక్రమానికి ఒక గొప్ప చిత్ర కళాకారుని కూడా ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరుగుతుంది.
ఆర్ట్ హిస్టోరియన్, రిటైర్డ్ ప్రొఫెసర్ చేత డెమో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వివరాలకు @9642214117, 9848586364, 9848035573
……………………………………………………..
వందేమాతర గీతానికి 150 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ చిత్రకళా ప్రదర్శన జరుగనుంది.
