వెండితెర పై మరోసారి వంగవీటి రంగా కథ

దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్న ‘ ‘దేవినేని ‘ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో జి.ఎం. ఎన్ ఫిలిమ్స్, ఆర్.టి.ఆర్ ఫిలింస్ సంయుక్తంగా జి.ఎస్.ఆర్.చౌదరి, రామూ రాథోడ్ ఈ చిత్రాన్ని సమ్యుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా వంగవీటి రంగా పాత్ర ఆ పోషిస్తున్న సురేష్ కొండేటి కి సంబంధించిన స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తొలి ప్రయత్నంగా తెరముందుకొస్తున్న సంతోషం పత్రిక ఎడిటర్ అయిన సురేష్ కొండేటి వంగవీటి రంగా ఫస్ట్ లుక్ లోనే ఆకట్టుకున్నారు. అయితే ఇదే కథతో గతంలో రాంగోపాల్ వర్మ ‘వంగవీటి ‘ పేరుతో సినిమా తీసారు. అదే కథకు ఇప్పుడు ‘దేవినేని ‘ పేరు పెట్టడం తో ఈ చిత్రం పై ప్రేక్షకులకు ఆశక్తి పెరిగింది. చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘ఆనాటి మహాభారతం, రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే మనకు తెలుసు. వారిద్దరి మధ్యా ఎలాంటి సంఘరణ జరిగింది, అది మరణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని వివరించారు. ఈ సినిమాకి మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అందించిన రీరికార్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఫుల్ లెంథ్ గా వంగవీటి రంగా పాత్రల్లో చేస్తున్న సురేష్ కొండేటి క్యారెక్టర్ మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా త్వరలో థియేటర్లోనే విడుదవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ అవుల వెంకటేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap