వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీ విజేతలు

25వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ)

“శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది (మార్చ్ 24, 2020) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 25వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు.
విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ సారి పోటీకి అమెరికా నుంచే కాక, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా. చెక్ రిపబ్లిక్, సింగపూర్ దేశాల నుంచి రచయితలు స్పందించడం చెప్పుకోదగ్గ విశేషం.
అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.
బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి.కామ్ లోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.

ప్రధాన విభాగం – 25వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“సుభద్ర పట్టాభిషేకం”- కె,వి, బాపారావు (Los Angeles, USA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“జనని-జన్మభూమి” – శ్రీనివాస ఫణి కుమార్ డొక్కా (Atlanta, GA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“నేను తప్పు చేశానా?” –సాయి ప్రభాకర్ యర్రాప్రగడ (Winter Garden, FL) ప్రశంసా పత్రం
“డోరియన్ – దూరియాన్”- నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్, Tampa, FL) ప్రశంసా పత్రం

ఉత్తమ కవిత విభాగం విజేతలు
“సిరి సంపదలు” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“అమావాస్య పున్నమి”- శ్రీనివాస్ ఫణి కుమార్ డొక్కా (Atlanta, GA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“దక్షిణాఫ్రికా”-రాపోలు సీతారామ రాజు (Johannesburg, South Africa) ప్రశంసా పత్రం
“అలల కలలు” – మురళీ శ్రీరామ్ టెక్కలకోట (Frisco, TX) (ప్రశంసా పత్రం)
===============================================
“మొట్టమొదటి రచనా విభాగం” -12వ సారి పోటీ
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
“ఆటలో అరటి పండు” – సింధూరి పోతుల (Prague, Czech Republic) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“క్షుధానలం” – గౌతమ్ లింగా (Johannesburg, South Africa) ప్రశంసా పత్రం
“అంతర్మధనం”- శాంత సుసర్ల (Houston, TX) ప్రశంసా పత్రం
“కల్యాణం, కమనీయం”- సి.హెచ్. రమాకాంత్ (Hamburg, Germany) ప్రశంసా పత్రం

“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
ఎవరూ లేరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap