అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం

హైదరాబాద్ లో ఆదివారం…ఏప్రిల్ 13, 2025, ఉదయం 9:00 నుంచి…

ఈ వారాంతంలో ఆదివారం…ఏప్రిల్ 13, 2025…. సమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకా, వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో..

‘విశ్వావసు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన అంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా అహ్వానం పలుకుతున్నాం.

ప్రత్యేక అతిధులు: మాన్యశ్రీ మండలి బుధ్ధ ప్రసాద్ (ఆం.ప్ర.శాసన సభ సభ్యులు), ‘వేదకవి’ శ్రీ జొన్నవిత్తుల తదితరులు.

ప్రధాన ఆకర్షణలు: లబ్ధ ప్రతిష్టులైన 80 మంది కవుల స్వీయ కవితా పఠనం; 20 నూతన గ్రంధాల ఆవిష్కరణ;

ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారికి ‘రాయప్రోలు-వంశీ జీవన సాఫల్య పురస్కార ప్రదానం”; అంతర్జాతీయ పృచ్చకులతో డా. బులుసు అపర్ణ గారి “మహిళా అష్టావధానం”.

పూర్తి వివరాలకి జత పరిచిన ఆహ్వాన పత్రిక, సమగ్ర కార్యక్రమం చూడండి. బంధు, మిత్ర సమేతంగా విచ్చేసి ఆసక్తికరమైన సాహిత్యపు విందు ఆరగించి ఆనందించండి.

భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజు
రాధిక మంగిపూడి, రత్నకుమార్ కవుటూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap