“శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 12, 2021) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలు గా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా. చెక్ రిపబ్లిక్, సింగపూర్, ఐర్లండ్ దేశాల నుంచి రచయితలు స్పందించడం చెప్పుకోదగ్గ విశేషం. “నా మొట్టమొదటి కథ, కవిత” విభాగాలకి ఈ సారి కలం పట్టిన ఔత్సాహిక విదేశీ రచయితలు అధిక సంఖ్య లో ఉన్నారు. అందు వలన ముందు ప్రకటించిన ఒక నగదు బహుమతికి అదనంగా మరొక సమాన బహుమతిని అందిస్తున్నాం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి.కామ్’ లోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి కృషికి గుర్తింపుగా తెలుగు సాహిత్యాభిమాని శ్రీ ముదుగంటి జితేందర్ రెడ్డి (హ్యూస్టన్) గారు బహుమతులకి స్వఛ్ఛందంగా నగదు ప్రదానం చేయడం ఈ సారి ప్రత్యేకత. ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
విజేతల వివరాలు:
ప్రధాన విభాగం – 26వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“కర్మ యోగి”- శ్రీధర్ రెడ్డి బిల్లా (Cupertino, CA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“మిలియన్ డాలర్ బేరం” – శర్మ దంతుర్తి (Elizabethtown, KY) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“శ్రీలక్ష్మి” – శ్యామలాదేవి దశిక (Monmouth Junction, New Jersey) ప్రశంసా పత్రం
“మరోమారు”- రాధిక నోరి, Tallahassee, FL) ప్రశంసా పత్రం
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“ఇవాళ మాత్రం” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“తొలిపొద్దు సూర్యుళ్ళు”- సుధా శేఖర్ (Milwaukee, WI) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఇక్కడంతా క్షామమే”-రాపోలు సీతారామ రాజు (Johannesburg, South Africa) ప్రశంసా పత్రం
“వీడ్కోలు” – శాంత రాయప్రోలు (Jacksonville, FL) (ప్రశంసా పత్రం)
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
“మొట్టమొదటి రచనా విభాగం” -13వ సారి పోటీ
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
“ఇంత సౌఖ్యమని నే చెప్పజాల” – రవి మంత్రిప్రగడ (Dublin, Ireland) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“హృదయ స్పందన- కల్యాణి నల్లాన్ చక్రవర్తుల (Sunnyvale, CA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“మత్స్య గంధి”- రామ్ నాథ్ బొద్దపాటి (Danbury CT) ప్రశంసా పత్రం
“పరిచితులు”- శ్రీనాథ్ వాడపల్లి (New Jersey, USA) ప్రశంసా పత్రం
“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
“అన్ టైటిల్డ్”- శ్రీనాథ్ వాడపల్లి (New Jersey, USA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“జ్ఞాపకాల బరువు”- రవి మంత్రిప్రగడ (Dublin, Ireland) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“వర్షంలో ఓ సాయంత్రం”- లత కందికొండ (ISSAQUAH, WA) ప్రశంసా పత్రం
“ఉగాదులు ఉషస్సులు”- దామరాజు విశాలాక్షి(Canada) ప్రశంసా పత్రం
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు)
Congrats to all winners.