1980 సంవత్సరంలో నేను పబ్లిసిటీ డిజైనర్ గా మద్రాస్ వచ్చాను. ఆ సమయంలో కొంతమంది చిత్రకారులు చందమామ ముఖచిత్రాలను ఒక పుస్తకముగా తయారుచేసి, వడ్డాది పాపయ్యగారి చిత్రాలను ప్రాక్టీస్ చేయడం నేను చూసాను. నేను కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. వడ్డాది పాపయ్యగారు చిత్రాలను చూసిన ప్రతిసారి నాలో చిత్రకళపై ఎంతో ఉత్సాహం పెరుగుతూవుండేది. తరువాత కాలంలో తమిళనాడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఇంప్రూమెంట్ అసోసేషన్ మెంబరుగా మరియు వైస్ ప్రెసిడెంట్ గా, వర్కింగ్ కమిటీ మెంబరుగా నేను పనిచేసాను.
ఆ సమయంలో మన సినీ పబ్లిసిటీ చిత్రకారులు M. రామారావుగారు. A.S. మూర్తిగారు, అంకయ్యగారు మరికొంతమంది మన తెలుగు చిత్రకారులను TACI అసోసేషన్ మెంబర్లగా చేర్చాను. మేము కలసి మాట్లాడుకొనే సమయంలో వపా బాపుగారు గురించే ఎక్కువ మాట్లాడుకొనేవాళ్ళం. 2014 మొట్టమొదటిసారిగా యం.రామారావు గారితో మన తెలుగువాళ్ళం అందరు కలసి వపా, బాపు ఆర్ట్ అకాడమి స్థాపించాలని ఆలోచన వచ్చింది. తెలుగు, తమిళ చిత్రకారులతో చైన్నెలో మొదటి క్యాంప్ చైన్నెలో నిర్వహించాం. 2016 సంవత్సరం జనవరి 26 తేదిన పాలకొల్లు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అప్పటి ప్రెసిడెంట్ కొమ్ముల మురళి, మా గురువుగారు G.S.N. గారు మరియు ఉదయకుమార్ గారు- నా శిష్యుడు భవాని ప్రెస్ శ్రీనివాస్ మరికొంతమంది పాలకొల్లు చుట్టుప్రక్కల ప్రాంతాల చిత్రకారులతో కలసి క్యాంప్ మరియు చిత్రకళా ప్రదర్శనలు ప్రారంభించాము. ప్రతి సంవత్సరం ఆంధ్ర, తమిళ, కేరళ, కర్ణాటక చిత్రకారులతో లయన్స్ క్లబ్ వారి సహాయంతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. చిత్రకళపై ఆసక్తి వున్నవారిని చిత్రకళలో ప్రోత్సహించడం, తోటి చిత్రకారులకు సహాయపడటం మా వపా-బాపు ఆర్ట్ అకాడమి ముఖ్య ఉద్దేశం.
వపా గారి తో ప్రత్యక్ష పరిచయం లేదుకాని, బాపు గారిని చెన్నై లో రెండు మూడు సార్లు కలిసాను.
డి.రామకృష్ణారావు (రాకీ)
వపా బాపు ఆర్ట్ అకాడమి
( ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్)
మంచి ప్రయత్నం