శ్రీకాకుళంలో వపా శతాధిక జయంతి ఉత్సవాలు

వడ్డాది పాపయ్య గారి శతాధిక జయంతి ఉత్సవాలు శ్రీకాకుళంలో బాపూజీ కళామందిర్ లో డిశంబర్ 30 న శుక్రవారం ఉత్సవం బ్రహ్మాండంగా జరిగింది. అద్భుత చిత్రకళా పాటవంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సిక్కోలు కీర్తిని ఇనుమడింపజేసిన వ్యక్తి వడ్డాది పాపయ్య(వపా) అని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో వపా శతజయంతి ఉత్సవ కమిటీ, సాంస్కృతిక,సాహిత్య,ఆధ్యాత్మిక సంస్థ శ్రీసుమిత్ర కళాసమితి సంయుక్త నిర్వహణలో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. పాపయ్య సిక్కోలులో పుట్టడం మనకు గర్వకారణమన్నారు. నగరంలోని పెట్రోమాక్స్ వీధికి వడ్డాది పాపయ్య పేరు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. యానిమేషన్ రంగంలో కృషిసల్ఫిన చిత్రకారుడు, ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఉత్తం కుమార్ మాట్లాడుతూ తన బాల్యంలో వపా చిత్రాలతో ప్రేరణ పొందానన్నారు. శ్రీసుమిత్ర కళాసమితి గౌరవ అధ్యక్షులు డా. కొంచాడ సోమేశ్వర రావు వపా చిత్రాల యసస్సును కొనియాడారు. ఈ సందర్భంగా వపా చిత్రాలతో కూడిన 2023 సంవత్సరపు క్యాలెండర్ ను మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. ఆంధ్రా యూనివర్శిటీ విశ్రాంత ఉపన్యాసకులు ఆదినారాయణ గారు మాట్లాడుతూ ‘వపా గారిని 1982 ప్రాంతంలో కశింకోటలో కలిశానని, వారి నిడారంబర జీవితం, కళోపాసన చూసి ముగ్దుడనయి పోయానన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధి, శిల్పి దివిలి హేమచంద్ర వపా బొమ్మల గురించి, ఆయన జీవితం గురించి ఆశక్తికర ప్రసంగం చేశారు. వపా సతీమణి వడ్డాది లక్ష్మీ మంగమ్మను ఘనంగా సత్కరించారు. అనంతరం సుంకర చలపతిరావుకు వపా విశిష్ట స్మారక పురస్కారం, శిల్పి దివిలి అప్పారావు, చిత్రకారులు ఇప్పిలి జోగిసన్యాసిరావు, విజయవాడకు చెందిన వపా శతజయంతి సంచిక రూపకర్త కళాసాగర్ యల్లపులకు వపా స్మారక పురస్కారాలను, వడ్డాది రవిరామ్, వడ్డాది పావన్ రామ్, ఇంటాక్ శ్రీకాకుళం చాప్టర్ చల్లా ఓబులేసు, పాలకొల్లు వపా-బాపూ ఆర్ట్ అకాడమీ కొసనా భాస్కరరావులను పురస్కారాలతో మంత్రి సత్కరించారు.

VaPa son Vaddadi Raviram visiting the art exhibition

వపా చిత్రకళా ప్రదర్శనలో వడ్డాది పాపయ్య గారి పది ఒరిజినల్ చిత్రాలను కూడా ప్రదర్శించడం విశేషం. వపా రిప్లికా చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులను సర్టిఫికేట్, జ్ఞాపికలతో సత్కరించారు. చిత్రలేఖనం పోటీలో విజేతలయిన బాలబాలికలకు బహుమతులు అందించారు. శ్రీ సుమిత్ర కళాసమితి అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇప్పిలి శంకరశర్మ, మండవిల్లి రవి, నక్క శంకరరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు దివిలి హేమచంద్ర, త్రివిక్రమదేవ్, సీది మాధవ్, రెడ్ క్రాస్ సంస్థ అధ్యకుడు పి. జగన్మోహన్ రావు, పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వపా చిత్రకళా ప్రదర్శననకు నగర వాసులు, విద్యార్థినీ భారీగా తరలి వచ్చారు.
-మాధవ్

SA:

View Comments (1)