చిత్రకళా తపస్వీగా కీర్తి పొందిన వడ్డాది పాపయ్య చిత్రాలు తెలుగు సంస్కృతికి ప్రతీకలని ఏ.పి. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు అన్నారు. 10 వ తేదీ ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్ ఆర్ట్ గేలరీలో ‘వపా శత జయంతోత్సవం’ వపా శతజయంతి కమిటీ మరియు 64కళలు.కాం అధ్వర్యంలో నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి పాల్గొన్న 40 మంది చిత్రకారులు గీసిన వపా రెప్లికా చిత్రాలతో నిర్వహించిన ప్రదర్శనను ముఖ్య అతిథి, ఏ.పి. పాఠశాల విద్యాశాఖ, కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు ప్రారంభించారు. సుంకర చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వపా శతజయంతి ప్రత్యేక సంచికను అంధ్రప్రదేష్ దృశ్య కళల అకాడెమి చైర్మేన్ కుడిపూడి శైలజా భరత్ ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథి వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ ఏ దేశ చరిత్రకైనా సంస్కృతి ముఖ్యమని, దాన్ని నిలబెట్టేవి కళలని, అందులో చిత్ర-శిల్పకళలు అతి ప్రధానమైనవన్నారు. సంస్కృతిలో కవులకన్నా కళాకారులు ప్రధాన భూమిక పోషిస్తారన్నారు. నా చిన్నప్పుడు కథల పుస్తకాలు ఎక్కువగా చదివేవాడినన్నారు. చందమామ, యువ దీపావళి సంచికల ముఖచిత్రాలూ, లోపల వర్ణచిత్రాలూ కూడా వడ్డాది పాపయ్య గారిని చిరకాలం గుర్తుంచుకునేలా చేశాయన్నారు.
శతజయంతి సంచికను ఆవిష్కరించిన అంధ్రప్రదేష్ దృశ్య కళల అకాడెమి చైర్మేన్ కుడిపూడి శైలజా భరత్ మాట్లాడుతూ వడ్డాది పాపయ్య గురించి చాలా తెలుసుకున్నానని, పదవీ భాద్యతలు స్వీకరించిన మొదటిగా ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. కళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులను అభినందించారు.
అత్మీయ అతిథిగా పాల్గొన్న గోళ్ళ నారాయణరావుగారు మాట్లాడుతూ వపా శతజయంతి సంచికను చూశాక, చలపతిరావుగారు మాటలువిన్న తర్వాత వపా గారి గురించి మాకు ఎన్నో విషయాలు తెలిశాయని, అంతటి మహాచిత్రకారుని శతజయంతి కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషమన్నారు.
జాషువా సాంస్కృతిక వేదిక నిర్వహకులు నారాయణగారు మాట్లాడుతూ వపా లాంటి గొప్పచిత్రకారుని శత జయంతి కార్యక్రామంలో మేము భాగస్వాములం కావడం మాకు సంతోషమన్నారు.
‘వపా కు వందనం’ పుస్తంలో ప్రతీ పేజీని సుందరంగా తీర్చిదిద్దారని వెంటపల్లి సత్యనారాయణ వపా శతజయంతి సంచికను సమీక్షించారు.
సభకి అధ్యక్షత వహించిన సుంకర చలపతిరావు గారు మాట్లాడుతూ ప్రచారానికి, సత్కారాలకు దూరంగా జీవించిన వపా గొప్ప కళాతపస్వి అని, ఆ మహా చిత్రకారుని శతజయంతి సంచికను కళాసాగర్ తను కలసి ఎంతో శ్రమకోర్చి రూపొందించమని దానికి మంచి స్పందన వస్తుందన్నారు. ఆయన అభిమానులందరికీ అందుబాటులో వుండే విధంగా శతజయంతి సంచిక ధరను నిర్ణయించామన్నారు. ఇంకా మరికొన్ని చోట్ల వపా శతజయంతి చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించాలకుంటున్నట్లు తెలియజేశారు.
వడ్డాది పాపయ్య శతజయంతి కమిటీ కార్యదర్శి, శతజయంతి సంచిక రూపకర్తలలో ఒకరైన కళాసాగర్ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులకు సెర్టిఫికేట్స్ మరియు శతజయంతి సంచికను అందజేశారు. ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ కార్యక్రామాన్ని విజయవంతం చేసిన కళాకారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సభలో చిత్రకారులు టీవీ, శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ అసోసియేషన్, తిరుపతి కార్యదర్శి సాగర్ గిన్నె, విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు అల్లు రాంబాబు, చిదంబరం, వపా బాపు ఆర్ట్ అకాడెమి కొసనా భాస్కర రావు, అంధ్రా అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ సాయిబాబా, ఫొరం ఫర్ ఆర్టిస్ట్స్ అధ్యక్షులు సునీల్ కుమార్, TWAS బాలయోగి, ఏలూరు ఆర్ట్ సొసైటీ, చిత్రాలయ రాంబాబు, డమరుకం లలిత కళా సమితి, గుంటూరు మల్లిఖార్జున్ ఆచారి, చిత్రం సుధీర్, స్పూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆధ్యంతం విద్య ప్రయాగ వ్యాఖానంతో ఆశక్తిగా నిర్వహించారు.
ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులు:
_______________________________________
1) పి. చిదంబరం, విజయవాడ
2) ఏ. ఆప్పారావు, విజయవాడ
3) ఆరసవిల్లి గిరిధర్, విజయవాడ
4) అల్లు రాంబాబు, విజయవాడ
5) కె. గాంధి, విజయవాడ
6) అంజి ఆకొండి, కాట్రేనికోన
7) మధుసుధన రావు, ఏలూరు
8) చిత్రాలయ రాంబాబు, ఏలూరు
9) పి. శ్రీనివాస్, ఏలూరు
10) A.S.D. ప్రసాద్, ఏలూరు
11) S.M.D.V. దేవ్, ఏలూరు
12) పి. రేణుకేశ్వర రావు, ఏలూరు
13) మల్లిఖార్జున ఆచారి, గుంటూరు
14) సాగర్ గిన్నె, తిరుపతి
15) ఏ.రామచంద్రయ్య, తిరుపతి
16) కె. మహేశ్వర్, తిరుపతి
17) డా. బాలాజీ సింగ్, తిరుపతి
18) పి. మునిరత్నం రెడ్డి, తిరుపతి
19) సి ఎచ్. ప్రణవనాథ్,తిరుపతి
20) ఎస్. గీత, తిరుపతి
21) గాయత్రి దేవి, తిరుపతి
22) సుధ జాగీర్దార్, హైదరాబాద్
23) బాలయోగి, ఏలూరు
24) కె. శ్రీనివాస్, భీమవరం
25) టి. వీరభద్ర అచారి, ఆకివీడు
26) ఉదయ్ శంకర్ చల్లా, విజయవాడ
27) శాస్త్రి, మచిలీపట్నం
28) కొసనా భాస్కరరావు, పాలకొల్లు
29) సి ఎచ్. రాము, పాలకొల్లు
30) శ్రీనివాస రెడ్డి, చినగంజాం
31) రాఖీ, చెన్నై
32) ఎస్. ఆర్. మంచెం, కాకినాడ
33) దేవీ ప్రసాద్, గుంటూర్
34) శ్రీనివాస మనోహర్, గాజువాక
35) పార్వతి, తెనాలి
36) డి. శ్రీనివాసులు, కర్నూల్
37) ఎస్. చలపతిరావు, విశాఖపట్నం( వపా ఒరిజినల్స్)
38) కె. వెంకటరావు, చీరాల
39) రాం మోహన్, రాజమండ్రి
40) దివిలి హేమచంద్రా, శ్రీకాకుళం
So great event
చాలా మంచి కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను అనే బాధ ఉన్నా TCAలోగోను ఈ గొప్ప కార్యక్రమంలో చోటు కల్పించిన శ్రీ కళాసాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
కిరణ్ (IndiaToons.Com)
వడ్డాది పాపయ్యగారికి నిజమైన ఘనమైన నివాళి జరిగింది.చిత్రకారులందరు మహాద్భాగ్యంగా బావించి సభను జయప్రదంచేసినారు.
Excellent program excellent Article sir