
సాహిత్య, చిత్ర కళారంగాలలో కలంతో, కుంచెతో – వేళ్ళ (కుంచెలు అవసరం లేని ప్రక్రియ)తో సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో చరిత్ర సృష్టంచి, లిమ్కాతో పాటు 18 ప్రపంచ రికార్డులను స్వంతం చేసుకున్న ఆత్మకూరు రామకృష్ణ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని పలువురు ప్రముఖులు సూచించారు. యూట్యూబ్ ఛానల్లో సైతం చైతన్యం తీసుకువచ్చే ఆయనను యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కోరారు.

ఆదివారం (13-4-25) ఉదయం రాజమహేంద్రవరంలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీ వేదికగా 130 ఏళ్లనాటి చిత్రకారుడు వరదా వెంకటరత్నం జీవితంపై వెలువరించిన ‘ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు’ అన్న పుస్తకంపై పరిచయ కార్యక్రమం జరగింది. ఈ సందర్భంగా కూర్పు-సంపాదకత్వ సహకారాన్ని అందించిన ఆత్మకూరు రామకృష్ణను సత్కరించారు. మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ నిర్వహించిన ఈ సభకు సి.పి. బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షత వహించారు.
చేతి వేళ్ళతో కాన్వాస్ పై 13 గంటల 28 నిమిషాల్లో 100 తైలవర్ణ ప్రకృతి చిత్రాలను చిత్రించి ప్రపంచ స్థాయిలో ఫాస్టెస్టు పెయింటరుగా ఘనత వహించిన చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ అని సన్నిధానం శాస్త్రి ప్రశంసించారు. చిత్రకళతోపాటు సాహిత్యంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.
ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు వరదా వెంకటరత్నంపై పదహారుమంది శిష్యులు వ్రాసిన వ్యాసాలతో వెలువడిన ఈ పుస్తకం వరదావారి వాస్తవ జీవన ప్రక్రియను ప్రతిబింబిస్తోందని చిత్రకారిణి శ్రీమతి ఎన్.వి.వి.ఎస్. లక్ష్మి తన సమీక్షలో పేర్కొన్నారు. తన ప్రాణమిత్రుడు దామెర్ల రామారావు అర్థాంతరంగా మరణించగా, ఆయన స్మృతిగా దామెర్ల ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటులో వరదా వెంకటరత్నం పాత్ర చరిత్రలో నిలిచిందని ఆమె పేర్కొన్నారు.
భార్య, ఇద్దరు కుమారులు మశూచితో మరణించినా, మిత్రుడు దామెర్ల ఆశయం కోసం పరితపించిన మహామనిషి వరదా వెంకటరత్నం అంటూ, ఆత్మకూరు తన పుస్తకంలో అక్షర రూపంలో నిరూపించారని లక్ష్మి పేర్కొన్నారు.
తెలుగు జాతికి కీ.శే. వరదా వెంకటరత్నం గారు చేసిన కృషిని తెలిపేందుకే ఆయనపై ప్రత్యేకంగా ఈ పుస్తకం వెలువరించామని ఆత్మకూరు రామకృష్ణ తన కృతజ్ఞతలలో తెలిపారు. వరదా వెంకటరత్నం సేవానిరతికి నివాళిగా ఈ పుస్తకం నిలుస్తుందని పుస్తక ప్రచురణకర్త మాదేటి రవి ప్రకాష్ పేర్కొన్నారు.
సభలో ప్రముఖ చిత్రకారులు ఎన్.ఎస్. శర్మ, పి.ఎస్. ఆచారి, తారా నగేష్, బి. శ్రీనివాస్, పి. రవికాంత్, బెజవాడ రంగారావు, విద్యాధరి, వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
-మాదేటి రవి ప్రకాష్
ఈ ఇరువురు గోదావరివాసు, కళామ్మ తల్లి ముద్దుబిడ్డలైనా మిత్రద్వయం ఈ జగతిలో చిరస్మరణీయం🙏
మీరు ఒక చిత్రకారునిగా గొప్ప ఆశయం తో కళా తపస్వి తెలుగు చిత్రాకళా సంరక్షకుడు, తన మిత్రుని ఆశయ సాధన కోసం స్వర్గీయ వారదా వెంకట రత్నం గారు పరితపించిన తీరును, జగతికి తెలియ జేస్తూ చేసిన ప్రయత్నం ను మనసారా అభినదిస్తున్నాను. 💐💐💐💐🙏
ధన్యవాదాలు సార్
Congratulations to Shri Atmakuru Ramakrishna garu and Ravi Prakash garu for their valuable contribution of producing such valuable book on Kala Tapaswi shri Varada Venkata Ratnam Garu.Bezt wishes in your future endeavours.