వర్ణ పద చిత్రం-కళ కవితగా మారే క్రమం

సుప్రసిద్ధ కళా రచయిత విమర్శకుడు లంక వెంకట రమణ గారి కలం నుండి వెలువడిన మరో ప్రసిద్ద రచన “వర్ణ పద చిత్రం “ కళ కవితగా మారే క్రమం.

గ్రీకు భాషలో ఎక్స్ప్రాసిస్ అనే పదానికి తెలుగు అర్ధం కావాలంటే కళను చూస్తూ, అనుభవిస్తూలేదా ఆస్వాదిస్తూ కవిత్వం చెప్పడం అని చెప్పవచ్చు.ఇక్కడకళ అంటే దృశ్యకళ. అనగా చిత్ర కళ గాని శిల్ప కళ గాని కావచ్చు. ఒక చిత్రకారుని కుంచె నుండి జాలువారిన అపురూప చిత్రం కావొచ్చు లేదా ఒక శిల్పకారుడి ఉలి నుండి మలచబడిన అపురూప శిల్పం కావొచ్చు. ఇంకా ఒక చాయాగ్రాహకుని కెమెరా నుండి తీసిన అద్భుత రూప చిత్రం లేదా ప్రకృతి చిత్రం ఇంకేదైనా  కావొచ్చు. ఇలాంటి అపురూప చిత్రాన్ని, శిల్పాన్ని లేదా దృశ్యాన్ని చూసినప్పుడు రసజ్నుడైన ప్రేక్షకుడి మనసు పొందే ప్రేరణ లేదా స్పందనకు ప్రతిగా వ్యక్తీకరించబడిన మాటలు, పదాలు లేదా కవిత సాహిత్యం రూపంలో వ్యక్తం చేస్తాము ఇలా చిత్రకారుడు గాని కవి గాని పొందే రసానుభూతికి ప్రతి రూపమే ప్రాచీన గ్రీకు భాషలో ఎక్ప్రాసిస్ గా పేర్కొన్నారు. ఇలాంటి స్పందన అనేది ఆది మానవుడు మొదలు నేటి ఆధునిక మానవుడి వరకూ విభిన్న రకాలుగా జరుగుతునే వుంది. అది ఎప్పుడు ఏ ఏ సందర్భాలలో ఎలా వారు వ్యక్తం చేసారో తెలియ జెప్పే ప్రయత్నమే చేసారు  ఎల్.ఆర్.వెంకట రమణ గారు వర్ణ పద చిత్రణ అనే పేరుతో రచించిన ఈ గ్రంధంలో.

ఇక వివరాలలోకి వెళ్తే ఆది కాలం నుండి ఆధునిక కాలం వరకు మనిషి పొందిన భావ వ్యక్తీ కరణ ను ఎవరు ఏ విదంగా వ్యక్తీకరించారో చెప్పడానికి రచయిత చాలా అధ్యనం చేసినట్లుగా ఈ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. ఆది కాలంలో మనిషి తన భావాలను బొమ్మల లిపిలో వ్యక్తం చేసాడు. అలాంటి బొమ్మల లిపి నేటి ఆధునిక  లిపిగా పరిణామం చెందిన తర్వాత సాహిత్యం విశ్వ రూపం దాల్చింది. మనిషి తనలో కలిగే భావాలకు ఎదుట జరుగుతున్న పరిణామాలకు ఆక్రుతినిస్తూ అనుభవంతో తనకున్న కళాకౌశలం ద్వారా సాహిత్య రూపంగా కళా రూపంగా వెలికి తెస్తున్నాడు అంటాడు  రచయిత ఒక చోట. నిజంగా ఇది అత్యంత వాస్తవమైన విషయంగా చెప్పవచ్చు.
ఈ క్రమంలో మొదట క్రీస్తు పూర్వపు 13వ శతాబ్దానికి చెందిన హురేస్ అనే ప్రాచీన రోమన్ కవి తో  తన ఉదాహరణలు మొదలు పెడతాడు.ప్రాచీన రోమన్ కవి అయిన హురేస్ తన మిత్రుడు పైసాస్ కు ఉత్తరం రాస్తూ దానిలో ఒక చోట ut picture, apoesis  అనే మాటలు రాసాడని చెప్తారు. దీనికి చిత్రకళ ఎలాగో కవిత్వం అలాగా అని అర్ధం . అలాగే ఇంకో చోట ఈ రచయిత ఇలా పేర్కొంటాడు చిత్రకళా మరియు  కవిత్వం పరస్పర అనుభందం కలిగి వున్నాయని రిచర్డ్ అట్లిక్ అనే కళావిమర్శకుడు అంటాడు. ఇంకా అతను 1760 నుండి 1900 ల మధ్య దాదాపు 2300 చిత్రాలు షేక్స్పియర్ రచనల ప్రభావంతో చిత్రించ బడినాయని రిచర్డ్ అట్లిక్ పెర్కొన్నాడని చెప్తారు ఇంకా హోమర్ రచించిన ఇలియడ్ లోని “షీల్డ్ ఆఫ్ ఆహిలిస్ “వర్ణన కూడా ఆ అంశానికి చెందిన  తొలి ఉదాహరణలలో ఒకటిగా చెప్తాడు రచయిత. ఇంకా 1819 లో జాన్ కీట్స్ రచించిన ఓడ్ ఆన్ ఏ గ్రీశియర్ ఆరన్ అన్న కవితలో గ్రీసు  కుంపటి పై లేని దృశ్యాలను కూడా కవిత లో కలిపి చెబుతాడు అని కీట్స్ ను వుదహరిస్తాడు. ఇంకా ఝాన్ రస్కిన్ , డాంటే, విట్మన్, విలియం బ్లేక్,.బెన్ ఝాన్సన్, జార్జ్ హెర్బాట్, పొప్, వొర్ద్స్ వర్త్, ఇలియట్ ,బెర్రీ మాన్ వాల్కాట్,సీమోస్ హిమోనీ మొదలైన వారి రచనలలో ఈ ఎక్ప్రాసిస్ ఉదాహరణలు మనకు చూపిస్తారు /ఇంకా జాన్ బెర్రీ రచన” సెల్ఫ్ పోర్ట్రైట్ ఇన్ కాన్వాక్స్ మిర్రర్ “అనే గ్రంధం, మరియు చర్ప్లిట్ రచన” హోమేజ్ టు లోరియాన్ “అన్న రచనల్లో దృశ్యమాన చిత్రణ, కాలమాన ప్రదేశాలు మరియు వ్యక్తిగత అంశాలను చారిత్రక సంఘటనలతో సహా రచించారని చెప్తాడు. అంతే గాకా ఎక్స్ప్రాసిస్స్ పోయెట్రీ అనే గ్రంధాన్ని రాసిన క్రిస్టియానా నార్కొస్ తన రచనలోని చిత్రం శిల్పం లాంటి ద్రుష్యమానమైన అంశాలను సబ్దరూపంగా చెప్పవచ్చు అంటారు.
తెలుగు సాహిత్యంలో సహితం ఇలాంటి ఉదాహరణలు ఎన్నో వున్నాయని రచయిత ఈ గ్రంధంలో వుటంకిస్తాడు. అందుకు మహాభారతంలో ఆది కవి నన్నయ నుంచి ఎన్నో వుదాహరనలు ఇస్తాడు రచయిత. కవులందరూ నదిని స్త్రీ తో పోలిస్తే పింగళి సూరన తన కళా పూర్నోదయంలో పురుషుడైన విష్ణు మూర్తి తో పోలిక చెప్తాడు. గోదావరి ని అడవి బాపిరాజు ఉగ్ర కాలిక గా అభివర్నిస్తే , విశ్వనాధ వారు కిన్నెరసాని నది వొంపు సొంపులను ఎంతో వయ్యారంగా వర్ణించారు. ఇంకా శ్రీనాధుడు , రాయప్రోలు సుబ్బారావు, కొడాలి సుబ్బారావు, గోన బుద్దా రెడ్డి, తెనాలి రామకృష్ణ, శ్రీ శ్రీ , శివారెడ్డి , దర్బసయనం శ్రీనివాసాచార్య , రెంటాల కల్పన, యెన్ అరుణ, ఇంకా ముకుందరావు అనే రచయిత తన చిత్రం అన్న కవితలో ఒక పేద చిత్రకారుని బ్రతుకుని ఇలా పదాలతో చిత్రించిన మాటలు వుదహరిస్తాడు.

తార్రోడ్డుని కాన్వాస్గా చేసుకుని సూర్యుని వెలుగు నీడల పర్య వేక్షణలో రంగు రంగుల కలగలపుతో రమ్యంగా అతను ఒక రోజు రోజంతా శ్రీ రామ చంద్రుడౌతాడు. కాలే కడుపుతో కూడా అతన్నే వాటేసుకుని పడుకుని మర్నాటికి అరిగిపోయి చెరిగిపోయి / వీరాంజనేయుడౌతాడు / సాయిబాబా అవుతాడు/ యేసు ప్రభువు అవుతాడు // గాంధిజీ అవుతాడు /నేతాజీ అవుతాడు/ఇలా ఎన్నో రూపాలను ఆ చిత్రకారుడు తార్రోడ్డుపై వేషాలు కట్టి చూపిస్తాడు కడుపు కాలుతున్న / పైన ఎండలు మండుతున్న తను మాత్రం అలా కళారాధన చేస్తూనే ఉంటాడు.
దర్బసయనం అనే కవి తన ఒక కవితలో ఇలా అంటాడు పికాసో బొమ్మకే కాదు / పిల్లాడి పిచ్చి గీతకూ పరవసిస్తాడు / గీస్తూ పోవడమే అతని పని /బొమ్మల్ని మోస్తూ తిరగడు / అవే నడిచి వెళ్తాయి./బొమ్మల సొబగు ఇవని చెప్పడు, అవే మాట్లాడతాయి . ఇంకా ఒక రోజు కవి చిత్రకారుని ఇంటికి వెళతాడు . ఆ చిత్రకారుని పరిస్తితిని ఇలా వివరిస్తాడు.
ఇవాళ /అతనింటికి వెళ్లాను / ఇల్లు అతి సామాన్యం, అతని లానే / చిర్నవ్వు సహజం, అతని చిత్రం లానే / అతనిని అతని చిత్రాలతో పోల్చి చూపుతాడు. ఆ చిత్రకారుని ఇంటి గొడలపైనున్న వాఖ్యం కవిని కదిలిస్తుంది. అతని గోడ మీద మెరుస్తున్న వాఖ్యం / బొమ్మల్ని మోస్తున్న గోడలకు నమస్కారం… ఇలా కొన్ని అందమైన హృద్యమైన ఉదాహరణలు మనం ఈ గ్రంధంలో చూస్తాము.

ఇంకా కళ కవితగా మారే క్రమాన్ని మొత్తం పద్నాలుగు రకాలుగా విభజించవచ్చని చెబుతూ  వాటిని ప్రధానంగా వివరణ, వర్ణన, సంభాషణ , ప్రశ్న, స్పర్శ అనే ముఖ్య బాగాలుగా చూపించవచ్చని చెబుతూ అందుకు ఊతంగా వివిధ రచయితల కవితల నుండి పలు ఉదాహరణలను ఇస్తాడు రచయిత. అలాగే భావాల మార్పిడి సాధనంగా కళను పేర్కొన్న టాల్స్టాయ్, కళ కళ కోసం కాదు సమాజం కోసం అని నమ్మి ఆచరించి చూపిన జార్జ్ బెర్నార్డ్ షా,ఇంకా ఆస్కార్ వైల్డ్ , తెలుగు కథారచయిత పాలగుమ్మి పద్మ రాజు, ప్రఖ్యాత బెంగాల్ చిత్రకారుడు  చిత్త ప్రసాద్  ఇంకా నటుడు బళ్లారి రాఘవ తదితర గొప్ప రచయితలు. చిత్రకారుల సాహితీ కళా రూపాలనుండి ఎన్నో ఉదాహరణలను రచయిత మన ముందుంచుతాడు.
ఈ గ్రంధంలో  ప్రఖ్యాత ఆంగ్ల కవి జాన్ కీట్స్ గురించి రాసిన రెండు వ్యాసాలు, అలాగే జర్మన్ చిత్రకారిణి ఫ్రిదా కాలో, ఇంకా సర్రియలిస్ట్ చిత్రకారుడు సాల్విదార్ డాలి గురించి రాసిన వ్యాసాలు పాఠకుని మరింతగా  ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఇంతే కాకుండా మన ఆధునిక ఆంద్ర చిత్ర కళకు ఆద్యుడైన దామెర్ల రామారావు, తొలి తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు, పికాసో, హుస్సేన్ మన తెలుగు నైరూప్య చిత్రకారుడు ఎస్ వి రామారావు తదితర ఎందరో వ్యక్తులు వారి కళలు తద్వారా వివిధ రచయితలు పొందిన రసాను భూతిని వారి కవితలలో వ్యక్తీకరించిన వివిధ భావాల సమాహారాన్ని మనం ఈ గ్రంధంలో చూస్తాము.

చివరిగా ఇది కేవలం ఒక చిత్రకారుడిని గురించిన రచన కాదు, అలాగని కేవలం ఒక సాహిత్యకారుడి గురించిన రచన కూడా కాదు. ఒక చిత్రకారుడి చిత్రంపై సాహిత్యకారుడు, సాహిత్య కారుడి రచనలపై ఒక చిత్ర కారుడి స్పందన ఎప్పుడు ఎవరు ఎలా స్పందించారో తెలుసుకునేందుకు రసజ్ఞుడైన పాఠకుడికి ఉపకరించే గ్రంధం ఈ ” వర్ణ పద చిత్రణ. కళ  కవితగా మారే క్రమం ” అన్న ఈ గ్రంధం. ఇందులో రచయిత కృషి మనకు కనిపిస్తుంది. చిత్ర కళ సాహితీ కళలపై అభిరుచి వున్న వ్యక్తులకు ఉపయుక్తమైన మంచి పుస్తకం ఈ వర్ణపద చిత్రణ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది కేవలం చిత్రకారుడిని గురించిన రచన కాదు, అలాగని కేవలం ఒక సాహిత్యకారుడి గురించిన రచన కూడా  కాదు. ఒక చిత్రకారుడి చిత్రంపై సాహిత్యకారుడు, సాహిత్య కారుడి రచనపై ఒక  చిత్ర కారుడి స్పందన ఎప్పుడు ఎవరు ఎలా స్పందించారో తెలుసుకునేందుకు రసజ్ఞుడైన పాఠకుడికి ఉపకరించే గ్రంధం ఈ” వర్ణ పద చిత్రణ. ఇందులో విషయ వ్యక్తీకరణకు రచయిత చేసిన ఎంతో గొప్ప కృషి మనకు కనిపిస్తుంది.  చిత్ర సాహితీ కళలపై అభిరుచి వున్న వ్యక్తులకు మంచి ఉపయుక్తమైన గ్రంధం ఈ వర్ణపద చిత్రణ “అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 212 పేజీలు, ఆకర్షణీయ మైన ముఖ చిత్రంతో పాలపిట్ట  వారి ప్రచురణలో వెలువడిన ఈ గ్రంధం వెల. 150 రూపాయలు.
ప్రత్యేకమైన ఈ అంశం పై విశేషమైన కృషి చేసి” వర్ణ పద చిత్రణ” అనే పేరుతో ఇంత మంచి గ్రంధాన్ని అందించిన శ్రీ లంకా వెంకట రమణ గారి కృషి నిజంగా ఎంతో అభినందనీయం.

-వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

3 thoughts on “వర్ణ పద చిత్రం-కళ కవితగా మారే క్రమం

  1. Sri Lanka venkataramana గారి లేఖిని నుండి ఉదయించిన మరో గ్రంథం ” వర్ణ పద చిత్రం” గురించిన పరిచయ వాక్యాలు ఆ పుస్తక గరిమ ను ప్రదర్శిస్తున్నాయి. మీ ఇరువురి కలాలు లబ్ద ప్రతిష్ఠ మైనవే. కనుక ఆ పుస్తకం ఎంత గొప్పగా ఉందో అంతగా ఈ పరిచయం అత్యంత సహజంగా అలరింది. ఇరువురికీ అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap