32 వ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ప్రారంభించారు.
పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం (01-01-2022) వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో ఏటా జరిగే అతి పెద్ద పుస్తక మహోత్సవాల్లో ఒకటిగా విజయవాడ పుస్తక మహోత్సవం గుర్తింపు పొందటం ముదావహ మన్నారు. పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదన్నారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని, చిన్న వయసులోనే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సభకు అధ్యక్షులుగా ఎమెస్కో విజయ్ కుమార్ వ్యవహరించారు.
అనంతరం దేవదాయ శాఖా మాత్యులు వేలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థిక సమస్యల్ని, కరోనా సమస్యలను అధికమించి బుక్ ఎగ్జిబిషన్ ను నిర్వహించిన నిర్వహకులను అభినందించారు. విజయవాడ మధ్య నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ మరుతున్న పరిస్థితిల్లో పుస్తక పఠనం అనేదీ తగ్గిందని ఈ సమయంలో బుక్ ఎగ్జిబిషన్ ప్రారంబించడం శుభసూచిక మన్నారు. గత చరిత్ర తెలుసుకోవడం ద్వారా పురోగతి సాదించ వచ్చునని అది పుస్తక పఠనం ద్వారా సాద్యమౌతుందని అన్నారు. ఈ అన్ని రకాల పుస్తకలు లభిస్తాయని అన్నారు. పుస్తక పఠనం వలన పురోభివృద్ధికి మార్గమని అన్నారు. బుక్ ఫెస్టివల్ విజయవాడ చరిత్రను ప్రపంచానికి తెలిపే విధంగా చేసిన బుక్ ఫెస్టివల్ కమిటీని అభినందించారు. అనంతరం విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ నేటి తరానికి పుస్తకం పఠనం తగ్గిందని యువత డిజిటల్ మీడియా వైపు మొగ్గిందని ఆవేధన వ్యక్తం చేశారు. బుక్ ఫెస్టివల్ సంక్షోభానికి పరిష్కారాన్ని సూచిస్తుందని అన్నారు.
ప్రతీ రోజు: ఈ పుస్తక ప్రదర్శనలో ప్రతీ రోజు కాళీపట్నం రామారావు వేదికపై సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలు, ప్రతిభా వేదికపై విద్యార్థులకు వివిధ పోటీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఓన్లీ కార్టూన్స్: ఈ పుస్తక ప్రదర్శనలో జనవిజ్ఞాన వేదిక వారు ప్రదర్శిస్తున్న వివిధ సైన్స్ సూత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓన్లీ కార్టూన్స్ అంటూ స్టాల్ల్ నంబర్ 116 లో పెట్టిన కార్టూన్ పుస్తకాలు పాఠకులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి.
సుమారు 200 స్టాల్స్ తో జరుగుతున్న ఈ ప్రదర్శనకు రెండు రాష్ట్రాల నుండి పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ ప్రదర్శన ముగియనుంది.
Great event. Book is a life time friend to teach somany things
పుస్తకాల పండుగే…అభినందనలు ..