
విజయవాడ ఆర్ట్ సొసైటీ స్థాపించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంలో సప్తమ వార్షికమహోత్సవం పేరిట 27 ఫిబ్రవరి 2022న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం బాలోత్సవ భవన్ లో కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ సభ్యులు చిత్రించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను, బ్రోచర్ ను కాటూరి వెంకటేశ్వరరావుగారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.
జమలు, ఖర్చులు మరియు జరిగిన కార్యక్రమాల వివరాలు ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారు కార్యదర్శి నివేదికను చదివి వినిపించారు.
కార్యవర్గం ఎన్నిక ప్రకటన :
కప్పగంతు రామకృష్ణ గారు గౌరవ అధ్యక్షులుగా కాటూరి వెంకటేశ్వర రావుగారి పేరును ప్రకటించడం జరిగినది. గౌరవ అధ్యక్షులు విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులుగా అల్లు రాంబాబుగారి పేరును ప్రకటించడం జరిగినది. అనంతరం అల్లు రాంబాబు అధ్యక్ష హోదాలో మిగతా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగినది. మిగతా సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా కొత్త కార్యవర్గం ఎన్నిక కాబడింది. గౌరవ అధ్యక్షులు కాటూరి వెంకటేశ్వరరావుగారు అధ్యక్షులు అల్లు రాంబాబు గారు ఉపాధ్యక్షులు కళాసాగర్ గారు, ఉపాధ్యక్షులు పావులూరి చిదంబరేశ్వరరావుగారు, ప్రధాన కార్యదర్శి ఉప్పరాపల్లి వేణుగోపాల్ గారు, కార్యదర్శి శీలం శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యదర్శి కౌతరపు పార్వతిగారు, కోశాధికారి ఆరేపల్లి అప్పారావుగారు, కార్యవర్గ సభ్యులుగా అనుమకొండ సునీల్ కుమార్ గారు, స్పూర్తి శ్రీనివాస్ గారు, ఒ. దుర్గామల్లేశ్వరరావు గారు,పి. రవి కుమార్గారు.
అభినందన సభ :
మధ్యాహ్న కార్యక్రమంలో విజయవాడ ఆర్ట్ సొసైటీ సభ్యులలో వారు చిత్రకళా రంగంలో చేస్తున్న కృషిలో విశిష్ఠతను గుర్తించి విశిష్ఠత ఆధారంగా అభినందన సభను ఏర్పాటు చేసి స్థానిక ఎమ్.ఎల్.ఏ. శ్రీ మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా సన్మానించి అభినందన పత్రాలు అందచేసిన పిదప చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు కాటూరి వెంకటేశ్వర రావు గారు, సూర్యశిల్పశాల అంతర్జాతీయ శిల్పకారుడు. మల్లాది విష్ణు గారు, శాసన సభ్యులు, స్థానిక ఎమ్.ఎల్.ఏ. డా. కప్పగంతు రామకృష్ణ గారు, పాలక మండలి సభ్యులు తెలుగు సంస్కృత అకాడమీ. మజ్జి సూర్యకాంత రావు, ప్రముఖ చిత్రకారులు ప్రెసిడెంట్, ఏలూరు ఆర్ట్ సొసైటీ. ముకాల రాంబాబు గారు, ప్రముఖ చిత్రకారులు కార్యదర్శి ఏలూరు ఆర్ట్ సొసైటీ. శార్వాణి మూర్తి గారు, స్థానిక కార్పొరేటర్, ప్రత్యేక సన్మానగ్రహితలు కాటూరి వెంకటేశ్వర రావుగారిని ఆరేపల్లి అప్పారావుగారిని ఎంతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమం అసాంతం అల్లు రాంబాబు గారి పర్యవేక్షణలో జరిగినది. విజయవాడ ఆర్ట్ సొసైటీ వార్షికమహోత్సవం సభా ప్రాంగణానికి కీ॥శే. నల్లి బాబురావు కళాప్రాంగణంగా నామకరణం చేశారు.



Thank you sir
Very nice 👍
విజయవాడ ఆర్ట్ సొసైటీ సప్తమ వార్షికోత్సవం ఒక సంబరంలా అద్భుతంగా జరిగింది… నిర్వాహకులు అందరికీ అభినందనవందనములు.. ఇంతటి కార్యక్రమంలో నాకు కూడా పాల్గొనే అవకాశం కల్పించినదులకు కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ..
అంజి ఆకొండి
విజయవాడ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన చిత్ర కళా ప్రదర్శన, సప్తమ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయం. నాకు కూడా సొసైటీ సభ్యుడిగా ఏడేళ్లు అనుబంధం … వారి అడుగులో అడుగు వేయడం చాలా ఆనందంగా ఉంది.
ఈ వేడుక లో సన్మాన, సత్కారాలు అందుకోవడం అదృష్టం గా భావిస్తూ..
VAS వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.– Vempataapu. vsn