
-మే నెల 12 న విజయవాడ ఆర్ట్ సొసైటీ 8 వ వార్షికోత్సవం వేడుకలు
-ముఖ్యఅథిదిగా ప్రఖ్యాత భారతీయ చిత్రకారులు వాసుదేవ్ కామత్
విజయవాడ ఆర్ట్ సొసైటీ 8 వ వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ వారి సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీ మరియు చిత్రకళా ప్రదర్శన 14-5-2023 న ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ, విజయవాడ సెమినార్ హాల్ లో జరుగుతుంది. ప్రదర్శనతో పాటు 12 మంది చిత్రకారుల లైవ్ డెమో వుంటుందని సంస్థ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వేణుగోపాల్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ చిత్రకళా ప్రదర్శనకు కేరళ, ఒడిస్సా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గోవా, కర్ణాటక, తెలంగాణా, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 40 మంది ప్రొఫెషనల్ చిత్రకారులు పాల్గొననున్నారు.
ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అథిదిగా ప్రఖాత భారతీయ చిత్రకారులు వాసుదేవ్ కామత్ (Vasudeo Kamath, Mumbai) హాజరుకానున్నాహాజరుకానున్నారు.
సాయత్రం 5 గంటలకు ముగింపు కార్యక్రమంలో వాసుదేవ్ కామత్ గారికి ‘చిత్రకళా తపస్వీ’ బిరుదు ప్రదానంతో పాటు విజేతలకు బహుమతులు, చిత్రకారులకు సన్మానాలు వుంటాయి అని సంస్థ అధ్యక్షులు అల్లు రాంబాబు తెలియజేశారు.
ఈ సమావేశంలో చిత్రకారులు కళాసాగర్, గిరిధర్, మురళీధర్ పాల్గొన్నారు.
తేదీ: 14-05-2023, ఆదివారం ఉదయం 9 గంటల నుండి
వేదిక: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ, సెమినార్ హాల్,(రమేష్ హాస్పటల్ రోడ్) విజయవాడ.

Nice 👍
This is one of the best activities of art in Vijayawada after bifurcation of undivided Andhra Pradesh, Wishing all success of the activity,