బుక్ ఫెస్టివల్ లో పుస్తక ప్రియుల సందడి

*విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియంలో
*2026, జనవరి 2 నుండి 12 వ తేదీ వరకు.

* 6 వ తేదీన పుస్తక ప్రియుల పాదయాత్రలో భారీగా పాల్గొన్న చదువరులు
……………………………….
36 వ విజయవాడ పుస్తక మహోత్సవం విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియంలో జనవరి 2 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు జరుగుతున్నది. దేశంలోనీ సుమారు 250 ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. తెలుగు, ఆగ్లం, హిందీ, సంస్కృత భాషలోని పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్, తెలుగు అకాడమీ, పబ్లికేషన్ డివిజన్, విశాలాంధ్ర, తెలంగాణ పబ్లికేషన్స్ లాంటి ప్రచురణ సంస్థలతో పాటు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన తెలుగు వికీపీడియా స్టాల్ సందర్శకులను ఆకర్షిస్తుంది.
ప్రాంగణంలో ఉన్న వేదికలపై ప్రతీ రోజు పలు పుస్తక ఆవిష్కరణలు, ప్రతిభ వేదికపై బాలలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు పుస్తక మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖులలో ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు, మాజీ ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు, ఉండవల్లి అరుణ్ కుమార్, మండలి బుద్ధ ప్రసాద్, తోటకూర ప్రసాద్ తదితరులున్నారు.

ఈ పుస్తక మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన తెలుగు వికీపీడియా స్టాల్ – 87 సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ తెలుగు వికీపీడియాలో స్వచ్ఛందంగా రాసే ఆసక్తి కలిగిన కవులకు, రచయితలకు, విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు. అంతర్జాలంలో విజ్ఞానాన్ని అందరికీ పంచాలన్నా ఉద్దేశ్యంతో వికీ పీడియా ఫౌండేషన్ గత రెండు దశాబ్దాలుగా కృషిచేస్తుంది. తెలుగు వికీపీడియాలో ఇప్పటికే లక్షా ముప్పై వేల వ్యాసాలున్నాయి. వీటి సంఖ్యను పెంచడానికి, వ్యాసాలను మరింత మెరుగు పరచడానికి పుస్తక మహోత్సవ వేదికను వినియోగించుకొని నెటిజన్లకు అవగాహన కళాసాగర్, సాయి ఫనీంద్ర, గోపినాధ్ కల్పిస్తున్నారు. టెక్నాలజీని సామాన్యులకు చేరువచేసే ఉద్ధేశ్యంతో కృషిచేస్తున్న ‘స్వేచ్ఛ’ స్టాల్-86 లాంటి ప్రత్యేకతలు కల్గిన స్టాల్స్ పుస్తక మహోత్సవంలో వున్నాయి. స్వేచ్ఛా సాఫ్ట్వేర్ వలన సామాన్య ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. స్వేచ్ఛ సంస్థ ఫ్రీ సాఫ్ట్వేర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలాంటి లైసెన్స్ పీజులు లేకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించు కోవచ్చు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, కళాశాలలు, సామాన్య వినియోగదారులకు ఖర్చు తగ్గుతుందన్నారు.

ఈ స్టాల్ సందర్శించిన వారిలో ప్రముఖ రచయితలు కొప్పర్తి రాంబాబు, మోదుగుల రవి కృష్ణ, గుమ్మా సాంబశివరావు, పాపినేని శివశంకర్, రావెళ్ల శ్రీనివాస రావు, యండమూరి వీరేంద్రనాధ్, చలపాక ప్రకాష్, పెద్ది సాంబశివరావు, పారా అశోక్, రెంటాల జయదేవ్, కిరణ్ ప్రభ, బండ్ల మాధవరావు, కడలి సత్యనారాయణ, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, నాగిశెట్టి, అనిల్ డ్యానీ తదితరులున్నారు.
88, 89 స్టాల్ల్స్ లో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

Share via
Copy link
Powered by Social Snap