విజయవాడలో కార్టూన్ ప్రదర్శన

52వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ, టాగూర్ గ్రంథాలయంలో కార్టూన్ ప్రదర్శన.

కార్టూన్లలోని హాస్యాన్ని ఆస్వాదిస్తే ఎన్నో వ్యాధులను తగ్గించవచ్చని పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. 52వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ, ఎంజీ రోడ్డులోని టాగూర్ గ్రంథాల యంలో శనివారం ‘తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ‘ ఆధ్వర్యంలో కార్టూన్ల ఎగ్జి బిషను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తన బాల్యమంతా గ్రంథాలయాల్లోని పుస్తకాలతో గడిచిందన్నారు. పుస్తకం మన భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే సాధనమని పేర్కొన్నారు. ప్రదర్శనలో చోటు చేసుకున్న అనేక కార్టూన్లు మనసుకు ఉల్లాసం కలిగించటమే కాకుండా సమాజంలోని ఎన్నో సమస్యలను ఎత్తిచూపి వాటికి పరిష్కారమార్గాలూ సూచిస్తాయన్నారు. కార్టూనిస్ట్ బాలి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శనలౌ కార్టూనిస్టులకు ఉత్సాహాన్నిస్తాయన్నారు. తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిమిశ్రీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కళాసాగర్ మాట్లాడుతూ తెలుగు కార్టూనిస్టులకు ఒక వేదిక వుండాలని తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్ ప్రారంభిచామని, ఇది రెండవ ప్రదర్శనని, వెయ్యి మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక కార్టూన్లో చెప్పోచాన్నరు, ఇంకా సీనియర్ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం., రావెళ్ల, కోశాధికారి కిరణ్, కాజా ప్రసాద్, సాయిబాబ, ఆదినారాయణ, చిదంబరం, కంచల నాగరాజు, కళ్లేపల్లి మధుసూదనరాజు, చొప్పా రాఘవేంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కార్టూన్ పోటీలు నిర్వహించారు.
తర్వాత విద్యార్థులకు పోటీలు: గ్రంథాలయ వారో త్సవాల్లో భాగంగా డాక్టర్ పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో వక్తృత్వ, మధ్యాహ్నం క్విజ్ పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతలుగా డాక్టర్ కోమలారాణి, జొన్నలగడ్డ రామ్మోహన్, తూములూరి రాజేంద్రప్రసాద్, కె.వి.ఎస్. ఈశ్వ రరావు వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link