ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో 2వ రోజు పున్నమి ఘాట్ లో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివల్ “విజయవాడ ఉత్సవ్” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్ శ్రీ నజీర్ గారిని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఘన స్వాగతం పలికారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని…
దసరా ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మిక శోభలు తీసుకువచ్చిన విజయవాడ ఉత్సవ్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు రావడం ఎంతో ఆనందకరం… ఉత్సవ్ సాంస్కృతిక వేదికపై సరిగమ విజేత వాగ్దేవి ఆలాపన చేసిన గానామృతం, విజయవాడకు చెందిన తన్మయి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో కలిసి వీక్షించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో డ్రోన్ షో, ఫైర్ వర్క్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మి శా గారు, టూరిజం శాఖ సెక్రెటరీ అజయ్ జెన్ గారు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము గారు, కాగిత కృష్ణ ప్రసాద్ గారు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు, టి.డి.పి. రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా గారు మరియు తదితర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మూడవ రోజు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ “విజయవాడ ఉత్సవ్” లో పాల్గొన్నారు.

One City – One Celebration స్లోగన్ తో నగరంలో సెప్టంబర్ 22 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు 9 రోజుల పాటు “విజయవాడ ఉత్సవ్” నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో నాలుగు వేదికల్లో 1) పున్నమి ఘాట్ 2) గొల్లపూడి గ్రౌండ్స్ 3) తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం 4) ఘంటశాల సంగీత కళాశాల లో పలు సినీ , సంగీత, నాట్య, పౌరాణిక నాటకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ “విజయవాడ ఉత్సవ్” కార్యక్రమాల్లో సుమారు వెయ్యిమంది కళాకారులకు అవకాశాలు కల్పించినట్లుగా నిర్వహకులు తెలియజేశారు.
