భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో లలిత కళా అకాడమి (భువనేశ్వర్), స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, విజయవాడ నేతృత్వంలో ఆదివారం (28-9-2025)న ‘వికసిత్ భారత్, కే రంగ్, కళా కే సంగ్..’ (‘విక్సిత్ భరత్’ కె రంగ్ కల కె సంగ్) అంశపై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఇది రెండు కేటగిరీలలో జరిగింది. ఒకటి ప్రొఫెషనల్ విభాగం, రెండవది విద్యార్థుల విభాగం. ఈ రెండు విభాగాలలోనూ సుమారు రెండు వందల మంది కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలనుడి 4 గంటల వరకు పోటీలు నిర్వహించారు, సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది.
విజేతలు: ముగింపు కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీకొండ రమేష్ గారు మాట్లాడుతూ… కళాకారులను, వారిలోని సృజనాత్మకతను నిరంతరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ కాలేజీ ఎప్పుడూ ముందుటుంది అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరూ చాలా మంచి చిత్రాలు వేశారు అని, అయినప్పటికీ బహుమతులు కొందరినే వరిస్తాయని, అందరినీ అభినందించారు. ముఖ్య అతిథి, యోగివేమన యూనివర్శిటీ ఫైన్ ఆర్ట్స్ డిపాట్మెంట్ అధిపతి కె. మృత్యుంజయరావు గారు మాట్లాడుతూ విద్యార్థులు చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, నేర్చుకునేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ ప్రోగ్రాంకు కో ఆర్డినేటర్స్ గా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ పి., డ్రీం ఆర్ట్ గేలరీ ఫౌండర్ పి. రమేష్ వ్యవహరించారు. ప్రొఫెషనల్, విద్యార్థుల విభాగాల చిత్రకళా పోటీల ఫలితాలను ప్రకటించారు. ప్రొఫెషనల్ విభాగంలో… ప్రథమ స్థానంలో నిలిచిన వెంపటాపు (తణుకు)కు రూ. 5000/, ద్వితీయ స్థానంలో నిలిచిన కె. శ్రీనివాస్ (భీమవరం)కు రూ. 3000/, తృతీయ స్థానంలో నిలిచిన ఎన్. ప్రసాద్ కు రూ. 2000/ నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థుల విభాగంలో, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారికి బహుమతులు, మెమెంటో తో పాటు సెర్టిఫికెట్స్ అందజేశారు.
-కళాసాగర్



