మురిపించిన మువ్వల సవ్వడి

16-01-2020,గురువారం, విజయవాడ కల్చరల్ సెంటర్లో అలరించిన విన్సెంట్ పాల్ నాట్య విన్యాసం
భరతనాట్యం, భారతీయ సంస్కృతికి గుండె లాంటిదని, లయాన్వితంగా సాగిన విన్సెంట్ పాల్ నృత్య ప్రదర్శన ఆద్యంతం హృద్యంగా ఉందని. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సర్వ శిక్ష శాఖ సంచాలకులు పాఠశాల విద్య కమిషనర్ ప్రముఖ సాహితీవేత్త డ్రేవు చిన వీర భద్రుడు అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి మరియు శ్రీనివాస ఫార్మ్ కలిసి, గురువారం, కల్చరల్ సెంటర్లో, ఏర్పాటుచేసిన, నాట్య స్రవంతిలో భాగంగా, బెంగుళూరుకు చెందిన విన్సెంట్ పాల్ భరతనాట్య ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రదర్శించిన ప్రతి అంశము విన్సెంట్ ప్రతిభకు అద్దం పట్టిందని విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్. ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు అన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ నాట్యాచార్యులు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ గ్రహీత చింత రవి బాలకృష్ణ మాట్లాడుతూ విన్సెంట్ స్మిత్ ప్రదర్శనలో చతుర్విధ అభినయాలతో పాటు హవ, భావ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది అన్నారు. అంతకుముందు నాట్య స్రవంతి కార్యక్రమంలో ప్రతిభతో పాటు, ప్రయోగ శీలత ప్రదర్శనా నైపుణ్యం, ఆవిష్కరణలతో పురోగమిస్తున్న యువ నాట్య కళాకారుల ఎంపిక జరుగుతుందని, ఈ క్రమంలో విన్సెంట్ స్మిత్ ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఈ నాట్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకోవడంతో పాటు, పాద తాడనం, హస్త ముద్రల విన్యాసం ఆశ్చర్య చకితులను చేసిందని కల్చరల్ సెంటర్, సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.

స్వీయ నృత్య కల్పనలో చతుర్భుజ గణనాధుని అన్న గణేష్ కృతి (రాగమాలిక ఆదితాళం) ని ప్రారంభ నృత్యంగా ప్రదర్శించిన విన్సెంట్ పాల్ వరుసగా రాగమాలిక, తాల మాలికల్లో, కార్తీక హెబ్బార్ రాయిగా, పార్స్వనాధ్ ఎస్ ఉపాధ్యే నృత్యకరించిన పంచభూతాలరింపు ప్రేక్షకుల్ని తాత్విక ధోరణి కి గురిచేసింది. మూడో అంశంగా బిల్వమంగళుడు రాసిన ‘రామనమో బబువ’ శ్లోకానికి చేసిన నృత్యం భక్తి పారవశ్యాన్ని కలిగించింది. బృందావని రాగం, ఆదితాళంలో సాగిన శ్రేయ కాత్యం , చివరగా స్వీ నృత్య కల్పన, ‘జయభరతాంచే (దేశ్ రాగం, ఆది తాళం) ప్రదర్శించి ప్రేక్షకుల్లో జాతీయ భావాన్ని నింపారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో మీనాక్షి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ , అధ్యక్షురాలు, కె. మీనాక్షి, శ్రీ నృత్య కళా నిలయ నాట్య చార్యిణి, గోనుగుంట శైలశ్రీ , మాలక్ష్మి ప్రాపర్టీస్ రియల్న్ ప్రైవేట్ లిమిటెడ్, సీఈవో, సందీప్ మండవ, ఇంకా నగరానికి చెందిన కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link