కనువిందు చేసిన వైజాగ్ ‘కళాయజ్ఞ’ ప్రదర్శన

చిత్రకళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్యఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కళాయజ్ఞ – జీవన రేఖలు చిత్రకళా ప్రదర్శన మరియు చిత్రలేఖనం పోటీలు ఆదివారం (30-7-23) విశాఖపట్నం డాబా గార్డెన్స్ దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం మూడవ అంతస్తులో అంతస్తులో లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ ‘జీవన రేఖలు’ చిత్రకళా ప్రదర్శనను ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కళాచరిత్ర ప్రొఫెసర్ శిష్ట్లా శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా చిత్రకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కళాకారులకు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ముందుకు వెళుతూ మన ప్రాచీన కళలను కాపాడుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అనంతరం ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మం మాట్లాడుతూ చిత్రకారులకు అవకాశాలను కల్పిస్తే వారు ఈ కళలో రాణించగలరన్నారు. అలాగే చిన్నారులు చిత్రలేఖనంని అభ్యసించటం వలన మానసికోల్లాసాన్ని పొందగలరన్నారు. అనంతరం ప్రముఖ యువ రచయిత మన హీరోలు సృష్టికర్త సుబ్బు ఆర్వీ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవలసిన బాధ్యత మనదేనని దానికి కళాయజ్ఞ లాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు రాజేశ్వరరావు, బుజ్జీలు సభనుద్దేశించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నేటి తరం చిన్నారులు చిత్రకళ ఔన్నత్యాన్ని తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నిర్వహించిన ఆర్ట్ కాంటెస్ట్ కి మంచి స్పందన వచ్చింది సుమారు 350 పైగా చిన్నారులు ఈ కాంటెస్ట్ లో పాల్గొని తమ ప్రతిభను చాటారు.

సాయంత్రం జరిగిన బహుమతీ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ కళాయజ్ఞ-జీవన రేఖలు చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు… చిత్రకళా పోటీలో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందించారు. ఈ “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శనలో సునీల్ కుమార్, గిరిధర్, శ్రీనివాసరావు కనుమూరి, శేఖర్, అమీర్ జాన్, శ్రీనివాస మనోహర్, రామచంద్ర చదరం, జగదీష్ చంద్ర శేఖర్, అంజి ఆకొండి, బి. శ్రీనివాసరావు, ఎం. రాంబాబు, కె.వి. శివ కుమార్, రాజు కందిపల్లి , రేష్మా ప్రసాద్, తిమ్మిరి రవీంద్ర, డి. శేషయ్య, వెంకట్ తిరుమలశెట్టి, యామిని బిరుదు, శ్రీలక్ష్మి చెరువు, చందన, మల్లాది బాలక్రిష్ణ. అంజి దర్మాడి, లక్ష్మి సువర్చల, ఉదయ్ శంకర్ చల్లా తదితరులు పాల్గొన్నారు.

“ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” సంస్థ తరుపున సునీల్ కుమార్ అనుమకొండ, గిరిధర్ అరసవల్లి, స్ఫూర్తి శ్రీనివాస్, మల్లిక్ లు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా భారీ సంఖ్యలో కళాకారులు, కళాభిమానులు, యువ చిత్రకారులు పాల్గొన్నారు.
శ్రీనివాస్

Felicitation to artist Seshabrahmam

SA:

View Comments (1)

  • కళలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది....ఈ కళాయజ్ఞం ఇలా రాష్ట్రం నలుమూలలా చేస్తే తప్పక భావి తరాలకు చక్కని కళాసంపదను అందివ్వగలము.

    థ్యాంక్యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆర్టికల్.

    ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం
    విజయవాడ