‘విశ్వకర్మ కళాపీఠం’ ఉగాది పురస్కారాలు

శ్రీ విశ్వకర్మ కళా పీఠం వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ప్రావీన్యులైనటువంటి వారికి ఉగాది పురస్కారాలు అందజేస్తారు. అలాగే ఈ సంవత్సరం శోభకృత నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 19-03-2023 ఆదివారం చుట్టుగుంట పోలేరమ్మ దేవస్థానం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా లోక కళ్యాణార్థమై చండీ హోమము తదుపరి సాంస్కృతిక కార్యక్రమము జరిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక పీఠాధిపతులు యోగి నరేంద్రానంద స్వామీజీగారు, సింధు మాతాజీ గారు పాల్గొన్నారు. అలాగే ఆధ్యాత్మిక గురువులు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ఎనిమిదవ తరం ముని మనవడు అయిన నొస్సం వీరంభట్లయ్య స్వామి వారు, పులివర్తి కేశవాచారి గారు, నందిపాటి రవీంద్రగారు, ఆలూరి సుబ్రహ్మణ్య శర్మ గారు, పూసపాటి బాలాజీ గారు గుంటుపల్లి చందుగారు విచ్చేశారు. ఇక ఈ కార్యక్రమంలో గురువుల చేత పీఠాధిపతుల చేత వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగమల్లేశ్వరరావు గారిని అభినందించారు. అనంతరం విద్యారంగం, వైద్యరంగం, న్యాయ సేవ, కళారంగం వాస్తు జ్యోతిష్య, రాజకీయ, మానవ సేవ, సమాజ సేవ, సాహిత్య రంగం ఇలా వివిధ రంగాలకు చెందినటువంటి వారికి సింధు మాతాజీ శ్రీ విశ్వకర్మ కళా పీఠం అధ్యక్షులు నాగ మల్లేశ్వరరావు నొస్సం వీరం భట్లయ్యగారి చేతుల మీదుగా దాదాపుగా 37 మందికి కళారత్న, కళా విశారద, వేద విద్యారత్న, కవి కేశరి, కళా సామ్రాట్ వైదిక రత్న, కవిబ్రహ్మ, సరస్వతీ రత్న, ఆయుర్వేద సేవారత్న, సామాజిక సేవ రత్న, జ్యోతిష్య విశారద, వేద సేవారత్న ఇలాగా అన్నిరంగములకు సంబంధించిన వారికి పురస్కారాలను ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కులమత బేధము లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రంలో సంబంధించినటువంటి వారు విజయం సాధించినటువంటి వారికి సేవ చేసినటువంటి వారిని గుర్తించి వారికి తగిన పురస్కారాలను అందజేయటం చాలా ఆనందంగా ఉందని పురస్కారాలు తీసుకున్నవారు వ్యవస్థాపకులు అయినటువంటి నాగ మల్లేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
మల్లికార్జునాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap