విజయ శిఖరంపై ‘కార్తికేయ’

చిన్నప్పటి నుండి పర్వతారోహణ పై ఆసక్తి పెంచుకొని, 11 ఏళ్ళ వయసులో దేశంలోని ఒక్కో శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించి, 16 సంవత్సరాల వయసులో విదేశాలలోని ఎత్తైన శిఖరాలు అధిరోహించి చరిత్రలో సృష్టించిన హైదారాబాద్ కుర్రాడు పడకండి విశ్వనాథ్ కార్తికేయ. ఆయన జీవిత ప్రయాణం ఈరోజు మీకోసం

కార్తికేయ తెలంగాణ రాష్ట్రం, హైదారాబాద్ నగర వాసులైన పడకండి రాజేంద్ర ప్రసాద్ – లక్ష్మి ద్వితీయ సంతానంగా 2008లో జన్మించాడు, కార్తికేయకు ఒక వుంది, పేరు వైష్ణవి, ఆమె ఎంబిబిఎస్ చదువుతుంది,ఆమె పర్వతారోహకురాలు కూడా.

కార్తికేయ LKG వరకు DRS పిల్లలతో చదువుకున్నాడు, తరువాత బోయిన్‌పల్లిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలకు చేరి, 1 వ తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుచున్నాడు. కార్తికేయకు క్రీడలంటే చాలా ఇష్టం, అతను రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలో రెండవ స్థానంలో మరియు పవర్ లిఫ్టింగ్‌లో మూడవ స్థానంలో నిలిచాడు.

పర్వతారోహణ దిశగా అడుగులు:
కార్తికే పర్వతారోహణ ప్రయాణం 11 సంవత్సరాల వయసులో ప్రారంభమైంది. కార్తేకేయ అక్క వైష్ణవి పర్వతారోహణ గురించి తెలుసుకుని, తల్లికి కొంతమంది పర్వతారోహకులను తెలిసినందున ఆమె ఒక ట్రెక్ ఏర్పాటు చేసింది. కార్తికేయ కూడా అక్కతో వెళ్లేందుకు తల్లిదండ్రులను ఒప్పించి పర్వతారోహణకు బయలుదేరాడు. అలా కార్తికేయ మొదటిసారి ఉత్తరాఖండ్‌లోని మౌంట్ రుదుగైరాను పర్వతాన్ని అధిరోహించాడు..

తర్వాత, కార్తికేయ 10 రోజుల సాహస కోర్సు కోసం ఉత్తరాఖండ్ లోని NIM (నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్)కి వెళ్లాడు, అక్కడే అతను మొదట జుమరింగ్, రాక్ క్లైంబింగ్ మరియు రాపెల్లింగ్‌ను శిక్షణ తీసుకున్నాడు.

తర్వాత మొదలైన కార్తికేయ పర్వతారోహణ ప్రయాణంలో ఇప్పటివరకు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో గల ఫ్రెండ్‌షిప్ శిఖరం, లడఖ్‌లోని డ్జో జోంగో శిఖరం, నాంగ్‌కార్ట్‌షాంగ్ శిఖరం, ఇంకా.. కాలా పత్తర్, మౌంట్ కాంగ్ యాట్సే, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మొదలగునవి అధిరోహించాడు.

విదేశాలలో పర్వతారోహణ:
కార్తికేయ దేశంలోనే కాకుండా విదేశాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు, వాటిలో కొన్ని

🔹ఆఫ్రికాలోని కిలిమంజారో.
🔹రష్యాలోని టెరెస్కోల్,
🔹అమెరికా, అలాస్కా లోని దేనాలి,
🔹అమెరికా, అండీస్ లోని మౌంట్ అకొన్ కాగువా,
🔹అంటార్కిటికా లోని మౌంట్ విన్సన్.
🔹ఆస్ట్రేలియా లోని మౌంట్ కోస్కియుస్కో.
🔹నేపాల్ లోని మౌంట్ లోబుచే.
🔹నేపాల్ లోని ఐలాండ్ పీక్.
🔹హిమాలయ పర్వతశ్రేణుల్లో గల ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాడు.

ఇది కేవలం 11 ఏళ్ళ వయసు నుండి దేశంలోని పర్వతాలు అధిరోహించడమే కాకుండా 16 ఏళ్ళ వయసులో వివిధ దేశాలలోని అత్యంత ఎత్తైన శిఖరాలు అధిరోహించి చరిత్ర సృష్టించిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ విజయగాథ. మరో విశిష్ట వ్యక్తి సక్సెస్ స్టోరీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.

మధుసూదన్ మామిడి
సెల్ నం. 8309709642

Share via
Copy link
Powered by Social Snap