దీపావళి వస్తుంది అంటే వాషింగ్టన్ తెలుగు ప్రజలు ఎదురు చూసేది వాషింగ్టన్ తెలుగు సమితి జరిపే దీపావళి వేడుకల కోసం. తెలుగు సంస్కృతికి పెద్దపీటవేస్తూ కొనసాగుతున్న ఈ దీపావళి వేడుకలు, ఈసారి కూడ సమితి సభ్యుల సహకారంతో,వాలంటీర్ల సహాయంతో,అంగ రంగ వైభవంగా Bellevue సిటీలోని న్యూపోర్ట్ హైస్కూల్లో తెలుగు ప్రజలను అలరింపచేసాయి. యాంకర్ సమీరా గారు తన మృదువైన తేట తెలుగు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, వర్ధమాన గాయకులు శిల్పారావు మరియు ప్రవీణ్ తమ పాటలతో అలరింపచేసారు. ప్రత్యేక అతిధి గా విచ్చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకులు కోటి గారు,వేదికపైకి వచ్చి కళాకారులతో కలిసి నాట్యం చేస్తు వారిని ప్రోత్సాహించటమే కాకుండా గాయకులతో కలిసి తాను కొన్నిపాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చివరిగా వాట్స్ అద్యక్షుడు రామ్ పాలూరి మాట్లాడుతూ 2019 సమితి సభ్యుల సహకారం, వాలంటీర్ల సహాయం వల్లనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కాగలిగిందని తెలుపుతు సమితి సభ్యులకు, వాలంటీర్లకు, వాషింగ్టన్ తెలుగు ప్రజలకు తన అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ షకీల్ పొగాకు,సెక్రటరీ శ్రీనివాస్ అబ్బూరి, కోశాధికారి ప్రసాద్ కామిడి, సాంస్కృతిక కార్యదర్శి జయపాల్ దొడ్డ, జ్యోతి ప్రకాష్, సునీత వులిశెట్టి, వాషింగ్టన్ తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.