నా మొదటి కార్టూన్ ‘వనితా జ్యోతి’ లో – భార్గవి

గత మూడు దశాబ్దాలుగా కార్టూన్స్ గీస్తున్న మహిళా కార్టూనిస్ట్ భార్గవి మంచి చిత్రకారిణి కూడా. వారి స్వపరిచయం ఈ వారం ‘మన కార్టూనిస్టులు ‘.

నేను పుట్టింది ఖమ్మంలో దీపావళి రోజు, అందుకే నా పేరు సువర్ణ భార్గవి అని పెట్టారు. నాన్న శ్రీ అప్పా రావు, స్వాతంత్ర సమర యోధులు , అమ్మ సుగుణ  వారి పది మంది సంతానం  ఆరుగురు ఆడపిల్లలు , నలుగురు మగ పిల్లల్లో,   నేను 7 వ దాన్ని. పది మంది లో పెరగటాన  సరదాగా మాట్లాడటం, నాన్న  తో పాటు అందరూ సరదాగా మాట్లాడేవారు. అందుకే చిన్న తనం నించి  జోక్స్ రాయడం కార్తూన్స్ గీయడం పెద్ద కష్టం అనిపించేది కాదు. ఆ రోజుల్లో  అడపా దడపా చిల్డ్రన్స్  డే  కి పండగలకి చిత్రలేఖనం పోటీలు, రంగోలి పోటీలు, సరదా కథల పోటీలు వగైరా లైబ్రరీ వారు పెట్టేవారు. అందులో పాల్గొని ఎన్నో భహుమతులు గెలిచాను.  ఆర్ట్ అన్న హాస్య కథలన్నా నాకు ప్రాణం.  చిన్నప్పుడు తెనాలి రామలింగని కథలు, చందమామ కథల లాంటివి ఎక్కువగా చదివేదాన్ని, ఎందుకంటే  10వ తరగతి వరకు తెలుగు మీడియం ఖమ్మం గవర్నమెంట్ స్కూల్ , ఆ తర్వాత  బొమ్మలు అంటే ఇష్టం అని ఇంటర్ బై.పి.సి. ఖమ్మం లో ఉన్న ఒకే ఒక్క ఉమెన్స్ కాలేజ్ చదివాను, దానివల్ల చదుకోవడమే కాకుండా సైన్స్ రికార్డ్స్, బొమ్మలు వగైరాలతో కార్టూన్స్ గియ్యటం వీలుకాలేదు. ఫైన్ ఆర్ట్స్ కి సంభందించిన కాలేజ్ లేనందున , డిగ్రీ  B.Sc., గవర్నమెంట్ కాలేజీ లో చదివే సమయంలో, పత్రికలకి ఎలా పంపాలి అనే విషయం తెలుసుకొని, నేను గీసిన  బొమ్మలు, కార్టూన్లు,  జోక్స్ పత్రికలకి పంపించేదాన్ని. 1982లో నన్ను కార్టూనిస్ట్ గా ప్రోత్సహించిన మొదటి పత్రిక వనితా జ్యోతి.
ఆ తరువాత ఆంద్ర ప్రభ, మాయూరీ, ఆంద్ర భూమి, ఆంద్ర జ్యోతి లాంటి  పత్రికలకు  తరచూ ఏదో ఒకటి పంపడం, వెంటనే వారు వారి పత్రికలో ప్రచురించాక పారితోషికం తో పాటు కాంప్లింటరీ కాపీ పోస్ట్ లో పంపించే వారు, దానికే నేను పరవశించి, చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ తరువాత అంతర్జాతీయ స్థాయి కార్టూన్  పోటీలకీ  పంపాలంటే మాటలు లేకుండా, బొమ్మలే నవ్వించే విధంగా  ఉండాలని  తెలుసుకొని, జపాన్ న్యూస్ పేపర్ వాళ్ళకి పంపితే, వాళ్ళు నా కార్టూన్స్ కి  “A”  ప్రైయారిటీ ఇచ్చి  ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం అలా ఎన్నో  క్యాప్‌షన్ లెస్ కార్టూన్ లు  గీసీ పంపాను.
మా  పెద్ద అక్క  స్నేహితులు , డా. విశ్వనాథ్ గారు ,  నీలో ఇంత కళ వుంది,  మా  వరంగల్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ కి ఆర్ట్ నేర్పమని అడుగటం తో 1989 నుండి 1995 వఱకూ ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్ గా , స్కూల్ మ్యాగజిన్  ఆర్ట్ఎడిటర్ గా పని చేస్తూ పిల్లలకి సంబందించిన కార్టూన్స్,  పజిల్స్ ఫ్రంట్ పేజ్ , డిజైన్స్  అన్నీ పత్రికలో  ప్రచురించటం జరిగింది. 2002  లో ‘ఆస్కా ‘ అసోసియేషన్ విజయవాడ వారి ఆద్వర్యం లో జరిగిన ‘కార్టూన్ మేళా ‘ మరియు గ్రూప్ ఎగ్సిబిషన్ లో పాల్గొన్నాను , తర్వాత  పలు కార్టూన్స్ సోలో షోలు నేను చదివిన విద్యా సంస్థల లో, ఆర్ట్ గ్యాలరీ లలో నిర్వహించటం  జరిగింది, గ్రూప్ షోలు అటు విజయవాడ లో , ఇటు హైద్రాబాద్ లో పలు మార్లు పాల్గొన్నాను , కళాసాగర్ ప్రచురించిన పలు పత్రికలలో నా కార్టూన్స్ ప్రచురించారు., ఆ తర్వాత పెళ్లి కారణం గా హైద్రాబాదు కి  వచ్చిన తర్వాత , 2002 లో కంప్యూటర్ మల్టిమీడియా కోర్స్ నేర్చుకొన్నాను.
2008 లో బుక్  పబ్లిషింగ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవెలప్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా సెలెక్ట్ చేశారు, ఎమ్.ఏ. ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి, ఎమ్.ఎఫ్ ఏ. పెయింటింగ్,  మైసూర్ యూనివర్సైటీ నుండి చేసా, ఆర్ట్ కి సంభందించిన అన్ని రకాల కోర్సు లు చేశాక , ఆర్ట్ టీచర్ గా ఆర్మీ స్కూల్ తో పాటు పలు  కేంద్రీయ విద్యాలయ స్కూల ల్లో  ఆర్ట్ తో పాటు కార్టూన్,  డ్రాయింగ్కూడా నేర్పమని అడిగారు, తర్వాత కంప్యూటర్ విద్యార్థులకు కార్టూన్ డ్రాయింగ్ క్లాస్ లు నేర్పాను. 2001 లో ఆర్.కే. లక్ష్మణ్ గారి ని కలిసి వారికి నా కార్టూన్స్ ని చూపించి , వారి ఆశీర్వచనం తీసుకుంటూ ఒక ఫోటో పక్కన ఉన్న కామేరా అతనిని అడిగితే మేము ప్రెస్ వాళ్ళం ఫోటో తియ్యను అనగానే, అర్.కె. లక్ష్మన్ గారు అతన్ని పిలిచి ఎందుకు తియ్యవు అని కోప్పడి , వారి పక్కన నన్ను, మా బాబు చాలా చిన్న వాడు వాడిని, కలిపి మరి ఫోటో పొందటం  ఒక అదృష్టం. ఆ ఫోటో నా చేతికి అందకున్నా, వారి ఆశీస్సుల బలం నా తోడుగా ఉన్నది .
అవార్డ్స్ :   ప్రతిభా పురస్కారం 2012 ,  కృషి రత్న పురస్కార్ , విశిష్ట సేవామిత్ర, 2013 కళారత్నటైటిల్, ఉగాది పురస్కారం 2017 మరియు 2018.. 7 హిల్స్ వారి ఆద్వర్యం లో మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్ 2016.  P.V నర్సింహా రావు నేషనల్ అవార్డ్  2018… కుమారి రాగతి పండరీ పురస్కారం 2019 తో సహా ఇంకా ఎన్నో  అవార్డ్ ల తో పాటు సత్కారాలు అందుకున్నాను..
2000 కి పైగా కార్టూన్లు గీసాను,   100 పైగా  ఆయిల్   పెయింటింగ్ లు  వేశాను. ప్రస్తుతం వర్ణ ఆర్ట్ సెంటర్ పేరిట హైదరాబాద్ లో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్  నడిపిస్తూ  ఎంతో మంది  పిల్లలకు, పెద్దలకు ఆర్ట్, కార్టూన్లు  నా సహచరి వాసు గారు, నేను నేర్పిస్తున్నాము.

64కళలు.కాం పత్రిక ద్వారా నా గురించి చెప్పుకునే అవకాశం కల్గినందుకు సంతోషిస్తూ…

మీ భార్గవి

6 thoughts on “నా మొదటి కార్టూన్ ‘వనితా జ్యోతి’ లో – భార్గవి

      1. కార్టూనిస్ట్ గా నా స్వపరిచయాన్ని 64 కళలు లో ప్రచురించిన కళాసాగర్ గారికి ధన్యవాదాలు,.

  1. కార్టూనిస్ట్ గా నా పరిచయం 64 kalalu.com లో ప్రచురించిన Kalasagar Yellapu గారి కి నా ధన్యవాదాలు… చాలా కాలంగా కార్టూనిస్ట్ గా నా పరిచయం 64 కళలు కు పంపండి అని అడిగినా , రాయటానికి ఎక్కువ సమయం పట్టలేదు కానీ, పంపటానికి సంవత్సరం కాలం పై నే పట్టింది, కారణం ఏమిటి అని (అడిగితే మళ్లీ ఇంకో సంవత్సరం కాలం పై నే ) అడగకుండా ఆర్టికల్ చదివి మీ అభిప్రాయం తెలుపండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap