మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చిన మహిళలకు సత్కారం
మహిళల స్వయం సహాయక గ్రూపులకు సహకారం అందిస్తూ, మహిళాభివృద్ధికి నాబార్డు తగిన విధంగా ప్రోత్సాం అందిస్తుందని నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విజయ్ తురుమెళ్ల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాబార్డు కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో విజయవాడలోని కల్చరల్ సెంటర్‌లో బుధవారం(11-03-20) మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలకు సంబంధించి స్వయం సహాయక గ్రూపు సభ్యులకు శిక్షన అందించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తొలుత నాబార్డు ఎజిఎం విజయ్ తురుమెళ్ల మాట్లాడుతూ మహిళలచే నడుపబడుతున్న వివిధ స్వయం సహాయక సంఘాల వ్యాపార విస్తరణ, అభివృద్ధికి సంబంధించి రుణాలు అందించడంలో నాబార్డు ముందంజలో ఉందని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళలకు ఆర్థిక అవసరాలను తీరుతున్నాయని, రానున్న కాలంలో నాబార్డు ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. చేతివృత్తిదారులకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. నాబార్డు ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా కలంకారి ఆర్ట్ పెయింటింగ్, మ్యారేజ్ డెకరేట్ ఆర్టికల్స్, ఉడ్ మూరల్ ఆర్ట్, ఫ్యాషన్ డిజైనింగ్, పేపర్ కిల్లింగ్ ఆర్ట్స్, పికిల్స్ అండ్ పాపడ్ మేకింగ్, బ్రెడ్ బ్యాంగిల్స్చ, పలు కొత్త ఉత్పత్తులను చేసే వారికి ప్రోతాహం ఇస్తున్నామని దీనికి సంబందించి మహిళలకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చి వారిని మంచి నైపుణ్యత సాధించే విధంగా తయారుచేయడంతో పాటు, అవసరమైతే బ్యాంకు లింకేజిబుణాలు కూడా సమకూర్చే విధంగా సహకరించనున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చిన వారికి సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.
మీనాక్షి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మీనాక్షి మాట్లాడుతూ 2017 నుండి నాబార్డుతో కలిసి జిల్లాలోని డ్వాక్రా మహిళలు వారి జీవనోపాధి కోసం పలు హ్యాండిక్రాఫ్ట్ రూపొందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తమ సంస్థ ఆధ్వర్యంలో 30 మంది మహిళలకు పట్టు చీరలపై మ్యాచింగ్, కుందన్ వర్క్. జిగ్ జాగ్ చేయడం వంటి వాటిని చేస్తున్నామని తెలిపారు. మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కూడా కల్పించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. తమ వద్ద తయారుచేసిన ఉత్పత్తులు ధర్మవరంలో మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో
భాగంగా మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ వారికి తగిన విధంగా ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ మహిళలు వ్యాపారంలో విజయవంతం సాధించే విధంగా కృషి చేసిన సభ్యులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమాన్ని కల్చరల్
సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నిర్వహించగా, ఆప్ కాబ్ జనరల్ మేనేజర్ రాజేశ్వరి, వాసవ్య మహిళా మండలి కార్యదర్శి రశ్మి, ఇండియన్ భ్యాంకు లీడ్ జిల్లా మేనేజర్ ఆర్. రామమోహన్ రావు, డిఆర్‌డిఎ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ సునితా లక్ష్మి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆర్ఎం రామకృష్ణ, కెనరా బ్యాంకు మేనేజర్ నివేదిత మహంతి తదితరులు పాల్గొన్నారు.