గుంటూరు, ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో గత సంవత్సరం నుండి నాలుగేళ్ళ బి.ఎఫ్.ఏ. కోర్స్ ప్రారంభించబడింది. ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం సెప్టెంబర్ 20 వ తేదీ నుండి 22 వరకు మూడు రోజులపాటు యూనివర్శిటీలో క్యాంపస్ లో ప్రముఖ చిత్రకారులు శేష బ్రహ్మంగారిచే వర్క్ షాప్ నిర్వహించబడింది.
ఇందులో డ్రాయింగ్, స్కెచ్చింగ్ లో మెళకువలు, వివిధ రకాల చిత్రణా మాధ్యమాల గురించి మొదటి సంవత్సరం విద్యార్థులు ఆశక్తిగా నేర్చుకున్నారు.
శేష బ్రహ్మంగారు బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ రెండరింగ్ లోని వివిధ పద్ధతులను, షేప్స్, పెరస్పెక్టివ్ డ్రాయింగ్, మోడల్ డ్రాయింగ్, ఫ్రీహేండ్ డ్రాయింగ్, హ్యూమన్ అనాటమీ తదితర అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అలాగే నీటి రంగులతో ఒక స్టిల్ లైఫ్, యాక్రలిక్ కలర్స్ తో ఒక పోట్రైట్ ను చిత్రించి చూపించారు.
వర్క్ షాప్ చివరరోజున కాలేజీ ప్రిన్సిపాల్ సిద్దయ్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి నిరుపమ, చద్ర మోహన్, శ్రీనివాస్ గార్లు చిత్రకారులు శేష బ్రహ్మంగారిని ఘనంగా సత్కరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ సిద్దయ్యగారు మాట్లాడుతూ ఇటువంటి వర్క్ షాప్ లు దేశంలో వున్న ప్రముఖ చిత్రకారుల్ని ఆహ్వానించి మరిన్ని నిర్వహించడానికి నాగార్జున యూనివర్శిటీ కృషి చేస్తుందన్నారు. విద్యార్థులందరూ భావి చిత్రకారులుగా రూపొందాలని ఆకాంక్షించారు.
-ఉదయ శంకర్ చల్లా