ప్రపంచ మలేరియా దినోత్సవం

“ఏప్రియల్ 25″న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్ని కలిసి 2007లో ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటుచేశాయి. ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం, మలేరియా వ్యాధి నిర్మూలన ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో, మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువగా ఆఫ్రికన్ పిల్లలే వున్నారు.

ప్రపంచ దేశాలన్నింటిలో నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, బుర్కినా ఫాసో, సియర్రా లియోన్ వంటి 5 దేశాలు ఎక్కువగా మలేరియా వ్యాధి బారినపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకటించింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 429,000 మలేరియా మరణాలు, 212 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి. 2015 దరామిల కొత్త మలేరియా కేసుల రేటు ప్రపంచవ్యాప్తంగా 21 శాతం పడిపోవడమేకాకుండా మలేరియా మరణాల రేటు 29 శాతానికి తగ్గింది. మలేరియాకు వాడిన మెడిసిన్స్ హైడ్రాక్సి క్లోరోక్విన్ ఇతర మలేరియా చికిత్సకు వాడే మందులను నేడు కరోనా నివారణకు ఉపయోగ పడడం, అమెరికా లాంటి అగ్రదేశాలతో పాటు.. ప్రపంచ దేశాలకు భారతదేశం అండగాఉండి ఆమందులను సరఫరా చేయడం గుర్తించతగ్గ అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap