ప్రపంచ తెలుగు సాంస్కృతిక  మహోత్సవం

45దేశాలు – 64 తెలుగు సంఘాలు – ఒకే వేదిక….

తెలుగు వారందరూ ఆనందించవలసిన ది…
తెలుగు వారందరూ కలిసి నడవ వలసినది..
తెలుగువారందరి గొంతు ఒకటిగా వినిపించ వలసినది…
తెలుగువారందరూ ఒకటిగా కాపాడవలసినది..
మొత్తంగా అందరూ కలిసి…
ఒకే మాట.. ఓకే పాట.. ఒకే బాట… గా.. ప్రపంచ తెలుగు వారందరికీ వేదికగా భావితరాలకు స్ఫూర్తిగా మాతృభాష అభివృద్ధికి.. సంస్కృతి సంప్రదాయాలకు, సాంస్కృతిక వైభవానికి నిలయంగా తెలుగువారి చరిత్రలో గౌరవప్రదమైన ఉత్కృష్ట మైన శిఖరంగా నిలువబోతోంది…. ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం.
ప్రపంచ తెలుగు వారందరూ ఒక వేదిక పైకి వచ్చి కలిసికట్టుగా ఐక్యమత్యంతో చేసుకుంటున్న తెలుగు పండుగ ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం.
జూలై 24, 25, 26, ఆగస్టు 1, రెండవ తేదీలలో ఐదు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ అంతర్జాల మహా తెలుగు పండుగలో 45 దేశాల నుంచి 64 తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ పండుగ జరుపుకుంటున్నాయి.

ప్రారంభమైంది ఇలా….
సాంస్కృతిక రంగంలో చైతన్య భరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ “జయహో భారతీయం” సామాజిక – విద్యా – సాంస్కృతిక – క్రీడా సంస్థ, జిజ్ఞాస సంస్థ, ప్రతి ఏడాది విద్యార్థులు, క్రీడాకారులు, సాహితీవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు,యువకులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూటారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ఏర్పాటయ్యాక ఏప్రిల్ నెల మొదటి వారంలో ఖాళీ సమయంను వృధా చేయకుండా జిజ్ఞాస సంస్థ జయహో భారతీయం సంస్థతోపాటు అమెరికాలో నివాసముంటున్న ప్రవాసాంధ్రుల తెలుగు సంఘం “తానా” తో కలిసి వెబ్నార్ ( అంతర్జాల సాంస్కృతిక కార్యక్రమాలు) ఈవెంట్స్ నిర్వహించారు. తరువాత ఆర్ట్ బీట్ పేరిట యువజనోత్సవం, ” అమ్మా నీకు వందనం పేరిట ప్రపంచ మాతృ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం లాంటి వెబ్ నార్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు అతిథులుగా హాజరై సందేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు దేశాల తో కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంద రూ… అన్నీ దేశాలలో ఉన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరితో కలిసి ఒక ఫెస్టివల్ జరిగితే ఎలా ఉంటుంది. అనే ఆలోచన ను సౌందర్య లహరి పేరిట జయహో భారతీయం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సారెడ్డి. చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ కార్యక్రమానికి తానా సంస్థ మహిళా కోఆర్డినేటర్ తూనుగుంట్ల శిరీష ను సహాయం కోరారు. అదేవిధంగా జిజ్ఞాస అధినేత భార్గవ్ కూడా ఈ కార్యక్రమానికి సహాయం అందిస్తానని తెలిపారు. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలు, సంగీతం, నాట్యం, రంగస్థలం, సంప్రదాయ వస్త్రధారణ ఇలా అన్ని అంశాల పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళకు ఆన్లైన్ పోటీలు నిర్వహించాలని చర్చించి ముప్పై ఐదు దేశాల తెలుగు సంఘాల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు,సంప్రదింపులు, సూచనలు తీసుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అయితే ప్రవాసాంధ్రులు చాలామంది మహిళలకే కాదు ఆ పోటీలు పురుషులకు కూడా నిర్వహిస్తే బాగుంటుందని సూచనలు ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మాజీ సంచాలకులు డాక్టర్ డి విజయభాస్కర్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు లతో సంప్రదించి సౌందర్యలహరి కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం గా మార్చి సంప్రదాయ వస్త్రధారణ, సంగీతం, నాట్యం, రంగస్థలం, పార్లమెంట్, తెలుగు సాహిత్యం ఇలా 21 అంశాలలో పోటీలకు ప్రణాళిక చేసి ఏడు సార్లు ప్రవాసాంధ్రులతో zoom మీటింగ్ లో చర్చించి ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టారు.

*45దేశాలు 64 తెలుగు సంఘాలు కలిసి ఐక్యంగా…..
– ప్రపంచ తెలుగు సాంస్కృతి మహోత్సవంలో దాదాపు 45 దేశాల నుంచి 64 తెలుగు సంఘాలు ఒకే తాటి పైకి వచ్చాయి. తెలుగు చరిత్ర లో కనీవినీ ఎరుగని రికార్డ్ అనే చెప్పాలి. ఇంత వరకు ఎన్నడూ అన్ని దేశాలకు సంబంధించిన తెలుగు అసోసియేషన్ లు కలిసి ఒక పండుగ చ్చేసిన దాఖలాలు లేవు. ఈ మహోత్సవానికి ప్రవాసాంధ్రులు అందరూ కలిసి ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జయహో భారతీయం- భారతదేశం, జిజ్ఞాస – భారతదేశం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఆంధ్ర ప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ, జర్మనీ తెలుగు అసోసియేషన్, సింగపూర్ తెలుగు సమాజం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, బహరేన్ తెలుగు కళాపరిషత్, తెలుగు వెలుగు జర్మనీ, డెన్మార్క్ తెలుగు అసోసియేషన్, తెలుగుఅసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, సింగపూర్ తెలుగు కమిటీ, చైనా తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెన్ బెర్రా, కామన్ అసోసియేషన్ ఆఫ్ చైనా, యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ఫోరమ్ – కువైట్, తెలుగు కళా సమితి కువైట్, ఆస్ట్రేలియా తెలుగు సమితి, ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ, సౌదీ తెలుగు అసోసియేషన్, సౌత్ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, తెలుగు కల్చరల్ సొసైటీ నార్త్రెన్-ఐర్లాండ్, తెలుగు కళా సమితి బహరెయిన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇజ్లాండ్ – న్యూజి ల్యాండ్, తెలుగు బ్యాత్మెంటిన్ క్లబ్ ఆఫ్ కాంటెంబరి – న్యూజి ల్యాండ్, తెలుగు కళా సమితి – ఓమాన్, దుబాయ్ తెలుగు అసోసియేషన్, ఖత్తర్ తెలుగు అసోసియేషన్, నార్వే తెలుగు అసోసియేషన్, అమెరికా తెలుగు మహిళ సంఘం లతో పాటు ఆయా ఆయా దేశాలలో వివిధ రాష్ట్రాల తెలుగు అసోసియేషన్స్ భాగస్వామ్యం అయ్యాయి.

ఈ పోటీలలో దాదాపు 9 ప్రధాన అంశాలలో 22 రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మూడు విభాగాలుగా వయసు ప్రాతిపదికన ప్రతి పోటీ ఉంటుంది. ప్రతి పోటీ లో మూడు విభాగాలు ఉంటాయి. సబ్ జూనియర్ , జూనియర్స్ ,సీనియర్స్. స్థాయిని బట్టి పోటీ నిర్వహిస్తారు. అందరూ ఇంటర్ నెట్ కనెక్ట్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ఇంటర్ నెట్ ప్రాబ్లమ్స్ కు నిర్వాహకులు బాధ్యత ఉండదు.
అందరూ zoom యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తెలుగు వారితో పాటు, తెలుగే తరులు కూడా పాల్గోవచ్చును. అయితే తెలుగు అంశాలతో పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. జూలై 22 వతేది రాత్రి 12 గంటల వరకు (భారత దేశ కాలమాన ప్రకారం) పోటీ లో పాల్గొనే అభర్ధులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చును.

1. సౌందర్య లహరి
సౌందర్య లహరి లో 5 రౌండ్స్ ఉంటాయి. బాలలకు రెండు రౌండ్స్ మాత్రమే.
సంప్రదాయ వస్త్ర ధారణతో పాటు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే చేనేత కు చేయూత పేరిట ఒకరౌండ్, తెలుగు సాహిత్యం లో మహిళల ప్రాముఖ్యత పైన ఒకరౌండ్ ప్రధానంగా ఉంటాయి. ఇక కట్టు బొట్టు యధాతధంగా, ప్రశ్న లు ఉంటాయి.
2. తెలుగు – వెలుగు
తెలుగు వెలుగు లో చందమామ కథలు, సామెతలు వాటివివరణ,పరభాషా లేకుండా తెలుగు లో మాట్లాడటం,తెలుగు పద్యాల పోటీ ఇలా నాలుగు అంశాలలో పోటీ జరుగుతున్నాయి. వయసును బట్టి మూడు విభాగాలు జరుగుతున్నాయి.
3. రాగమంజరి
రాగమంజరి లో గాత్ర పోటీలు ఉంటాయి.1. జానపద , 2. సినిమా,లలిత, గీతాలు,3. శాస్త్రీయ గానం
4. నాదామృతం
నాదామృతం పోటీలో కీబోర్డ్, తబలా, వయొలిన్,మృదంగం, వీణ, వేణువు, గిటార్, లాంటి ఏడు అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు.
5. అందెల రవళి
అందెల రవళి పోటీలో కూచిపూడి,భారత నాట్యం,కథక్, మణిపూర్,ఒడిస్సీ, ఆంధ్ర నాట్యం, లతో పాటు. రెండవ అంశం జానపదం, మూడవ అంశం వెస్ట్రన్, ఫ్యూజన్ నాట్యాలు ఉంటాయి. ఏ నాత్యమైనా తెలుగు పాటలతో మాత్రమే నర్తించ వలసి ఉంటుంది.
6. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో చిత్ర లేఖనం, కార్టూన్ పోటీల(థిం- తెలుగు భాష, సంస్కృతి పై) తో పాటు ఇసుక బొమ్మలు, మట్టి బొమ్మలు, చేతితో ఏ పదార్థంతో నైనా బొమ్మలు గీయటం లాంటివి క్లే ఆర్ట్, పేపర్ ఆర్ట్, రంగవల్లి పోటీలు లాంటివి ఉంటాయి. వీటిలో తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శనలు ఉండాలి.
7. రంగస్థలం
రంగస్థలం లో మూఖాభినయం(మైమ్), ఏకపాత్రాభినయం, ద్విపాత్ర ల ప్రదర్శన (ఇద్దరు కలిసి చేసే నటన, త్రిపాత్రాభినయం (ముగ్గురితో చేయవచ్చును)
8. భువన విజయం
భువన విజయం లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల పై యువత ప్రసంగాలు ఉంటాయి.

ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలలో పాల్గొనేందుకు నమోదు చెయ్యడానికి గడువు 22 వతేది వరకు మాత్రమే! మీరు ఇంకా నమోదు చేసుకోలేదంటే, వెంటనే http://tiny.cc/WTCFReg20 ద్వారా నమోదు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో, మలేషియా తెలుగు వాళ్ళ ప్రతినిధులుగా పాల్గొనడానికి గాను అన్ని వయసుల వారిని స్వాగతిస్తున్నాము. ప్రపంచ తెలుగు వాళ్ళందరితో కలిసి తెలుగుతనాన్ని, తెలుగు భాషా సాంస్కృతిని నలుదిశలా చాటేందుకు ఈ అవకాశాన్ని వదులుకోకండి.

నమోదు చేయడానికి చివరి రోజు : 21వ జూలై 2020
పోటీల నిబంధనలు : https://bit.ly/WTCFGuidelines

తూనుగుంట్ల శిరీష – మహిళ కోఆర్డినేటర్

మరిన్ని వివరాలకు, వాట్సప్ లేదా ఫోన్ ద్వారా ఆయా దేశాల వారు సంప్రదించవచ్చును.

 

6 thoughts on “ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం

  1. తెలుగువారిగా జీవిద్దాం … తెలుగుభాషను బ్రతికిద్దాం … డా : జె .వి . చలపతిరావు , విజయవాడ. ‌9849556162

  2. శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతమైన కార్యక్రమం తలపెట్టిన మీకు అభినందనలు. మీరు ప్రారంభించిన ఈ కార్యక్రమం నూటికి నూరుపాళ్లు విజయవంతం కావాలని విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను
    Dr.PVN Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap