ప్రముఖ రచయిత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థాన ప్రారంభించారు. వారి తొలి గ్రంధం “అనేక” 2004 లో ప్రచురితం కాగా, విదిత 2014 ప్రచురణయింది. దీపిక 2021లో ప్రచురణ తెచ్చారు. దీపికలో పూర్తి సాధికారిత కనిపిస్తుంది. ‘దీపిక’లో దర్శించిన విషయాలపై వోరప్రసాద్ (సాహితీ స్రవంతి) ఇలా వ్యాఖ్యానించారు “తొలి మలి తరం తెలుగు కథలు” సంకలనం గురించి వివరంగా చర్చించింది. తప్పులకు రుజువులు చూపిస్తూ సరి చేసిన వ్యాసం విలువైన సమాచారం ఇస్తుంది. పివి నరసింహారావు కాడిన ‘గొల్ల రామవ్వ’ కథను హరితకాంశాల నేపథ్యంలో విశ్లేసించారు. గురజాడ సాహిత్యం- పర్గీకరణలు రాయలును యుగకర్త అనడములోని సాహిత్య కులము బయట పెట్టారు. “వైతాళికులు” సంకలనం వివాదంలో విస్మరణకు గురైన కవితా సంకలనం “కల్పన”ను పాఠకులకు పరిచయం చేశారు. పరిశోధకులకు ఈ దేవీక నిజంగానే కరదీపిక.
పెనుగొండ వారికి తెలుగు సాహిణ్యానికి వారు చేసిన పనికి గాను అజో విభో కందాళం వారి ‘జీవన సాఫల్య పురస్కారం లభించింది. గతంలో ఆధికార భాషా సంఘం వారి తెలుగు బాషా పురస్కారం (2003)లో, ప్రజాకవి సుంకర సత్యవారాయణ స్మారక పురస్కారం (2003) వారి సాహిత్య కృషికి గుర్తింపుగా లభించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, ప్రముఖకవి, కథకుడు పాపినేని శివశంకర్ స్థానిక చరిత్ర, సంస్కృతులు బృహత్ చకెత్రలో అంతర్భాగాలు, బృహత్ చరిత్ర నిర్మాణానికి ఇది దోహదం చేసి, సుసంపన్నతను సమగ్రతను చేకూరుస్తాయి అన్ని వకుళాభరణం. రామకృష్ణ వ్యాఖ్య పెరుగొండ లక్ష్మీనారాయణకి బాగా నప్పుతాలు ఎందుకంటే ఒకరు సాహితీవేత్త అవటమే గాక, సాహితీ దరిత్రకారుడు కూడా ఆపటం చాలా విశేషం. ఈ రెండు లక్షణాలను కలబోనుకొని కళ్ళముందు నిలబడే రెండు ప్రశాంత రూపం పెనుగొండ లక్ష్మీనారాయణ.
పెనుగొండకు లక్ష్మీనారాయణకు 64కళలు.కాం పత్రిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది.