రచయితల సంఘం ‘స్వర్ణోత్సవం ‘

10,11 ఏప్రియల్ 2021, మచిలీపట్టణం లో.

కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలను 2021 ఏప్రియల్ 10,11 తేదీలలో, చరిత్ర ప్రసిద్ధి పొందిన కృష్ణాజిల్లా ముఖ్యపట్టణం- మచిలీపట్టణం’లో చిరస్మరణీయంగా జరుపనున్నట్లు ప్రకటించారు.
కృష్ణాజిల్లా రచయితల సంఘం నాలుగు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఒక పర్యాయం జాతీయ తెలుగు రచయితల మహాసభలు, పది పర్యాయాలు కృష్ణాజిల్లా రచయితల మహాసభలు, 15 జాతీయ సదస్సులు, ప్రజల గుండె తలుపులు తడుతూ రచయితల పాదయాత్రలు, 20కి పైగా పరిశోధనా గ్రంథాల ప్రచురణ వంటి కార్యక్రమాలు నిర్వహించి భాషోద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించింది.
ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా:
1) మారిపోతున్న సామాజిక విలువలు, జాతి చైతన్యానికి రచయితల పాత్ర, కృష్ణాజిల్లా సాహితీ చైతన్యం మొదలైన అంశాలపై సదస్సులు.
2) స్వర్ణోత్సవ సంచికగా ఒక పరిశోధక గ్రంథ ప్రచురణ
3) కృష్ణాజిల్లా రచయితల సంఘం పురస్కారాలు
4) వృద్ధ సాహితీ మూర్తులకు స్వర్ణోత్సవ సత్కారాలు
5) కవిసమ్మేళనాలు
6) సాహితీ వినోద కార్యక్రమాలూ ఉంటాయి.

• 2021 మార్చి, 10 లోపుగా ప్రతినిధిగా పేరు నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నారు. ఈ గడువులోగా నమోదయిన వారికి మాత్రమే ఈ స్వర్ణోత్సవాల సదస్సులలోగానీ, కవిసమ్మేళనాలలోగాని పాల్గొనే అవకాశం, స్వర్ణోత్సవ ప్రశంసాపత్రము, భోజన ఉపాహారాలు అందజేయగలుగుతాము. ప్రతినిధిగా నమోదు కోసం మీ పేరు, చిరునామా, సెల్ నెంబర్ మాకు ఉత్తరం, ఎస్సెమ్మెస్, లేదా మెయిల్ ద్వారా మాత్రమే పంపాలి. వాట్సాప్, టెలిగ్రాంలలో అంగీకరించరు. మీ వివరాలు అందగానే, ప్రతినిధిగా నమోదైనట్టు మీకు తెలియజేరు.

• ప్రతినిథిగా పేరు నమోదు చేసుకునేందుకు మీరు ఎలాంటి రుసుమూ చెల్లించ నవసరం లేదు. వసతి కోరుకునేవారు అధ్యక్షుడిని లేదా ప్రధాన కార్యదర్శిని ముందుగా సంప్రదించండి. హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగుళూరు వైపు నుండి మచిలీపట్టణానికి నేరుగా రైళ్లు, బస్సులూ ఉన్నాయి. విజయవాడ నుండి నాన్ స్టాప్ బస్సులు గంటకు మూడు-నాలుగు చొప్పున నడుస్తున్నాయి. అన్ని కరోనా కట్టడి నియమాలతో ఈ సభలను ఆరోగ్యప్రదంగా నిర్వహించేందుకు ప్రతినిధుల సంఖ్యను పరిమితం చేయాల్సి ఉంటుంది.

• కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ ప్రతినిధులుగా నమోదైన వారందరికీ త్వరలోనే తెలియజేస్తారు.
కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ 10,11 ఏప్రియల్ 2021 శని ఆదివారాలు:: ‘వేడుక’ ఎ.సి. ఫంక్షన్ హాల్, మచిలీపట్టణం-521001

గుత్తికొండ సుబ్బారావు, అధ్యక్షుడు, 9440167697
జి. వి. పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి, 9440172642

12 thoughts on “రచయితల సంఘం ‘స్వర్ణోత్సవం ‘

 1. తప్పకుండా వస్తాను సార్..
  రాజేష్ కలగంటి. ఇంటి నెం. 14-155/1
  ప్రభు నగర్, పోరంకి. 521137.

 2. I will attend the function.
  ఆంజనేయ స్వామి

 3. చాలా సంతోషం. నేను తప్పకుండా వస్తాను 1983 నుండి శ్రీ గుత్తికొండ వారి తో సాహితీ అనుబంధం. గుత్తికొండ వారు, పూర్ణచందు గారు అఖిల భారత రచయితల సమావేశాలు దిగ్విజయం గా నిర్వహించారు.
  బాగా జరగాలని కోరుకుంటూ దైవాన్ని ప్రార్ధిస్తూ
  కె బి కృష్ణ, సీనియర్ కథా నవలా రచయిత
  కాకినాడ

 4. మీరు తలపెట్టిన కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. కృష్ణాజిల్లా విజయవాడవాసిగా ఈ వేడుకలలో
  పాలుపంచుకునే మహదవకాశం కల్పించాలని నిర్వాహకులకు మనవి.
  శుభకామనలతో…
  పొలమరశెట్టి కృష్ణారావు,
  కవి, రచయిత, హైదరాబాద్.

  1. చాలా సంతోషం. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పెద్ద దిక్కైతే, శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీ వీ పూర్ణచంద్ గార్లు నిత్య కృషీవలురు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఈ నలుగురూ నాలుగు మూల స్తంభాలు.
   అద్భుతంగా నిర్వహించిన మీ సభల్లో చాలా సభలలో నేను పాల్గొనడం నా అదృష్టం. ఈ స్వర్ణోత్సవ వేడుకలు ముందు జరిపిన సభలో వలే గొప్ప గా జరగాలని భగవంతుని ప్రార్ధిస్తూ, సభలకు తప్పకుండా హాజరౌతాను.ఆత్మీయులు పూర్ణచందు గారికి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
   శుభాకాంక్షలతో
   డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వర్లు,
   302, విజయం శ్రీ రెసిడెన్సీ,
   6/3: యస్.వి.యన్. కాలనీ,
   గుంటూరు – 6
   సెల్: 9848361627 ంంంంంంంంంంంంంంంంంం

 5. చాలా సంతోషం. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పెద్ద దిక్కైతే, శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీ వీ పూర్ణచంద్ గార్లు నిత్య కృషీవలురు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఈ నలుగురూ నాలుగు మూల స్తంభాలు.
  అద్భుతంగా నిర్వహించిన మీ సభల్లో చాలా సభలలో నేను పాల్గొనడం నా అదృష్టం. ఈ స్వర్ణోత్సవ వేడుకలు ముందు జరిపిన సభలో వలే గొప్ప గా జరగాలని భగవంతుని ప్రార్ధిస్తూ, సభలకు తప్పకుండా హాజరౌతాను.ఆత్మీయులు పూర్ణచందు గారికి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
  శుభాకాంక్షలతో … మీ శ్రీహరికోటి ,రాష్ట్ర అధ్యక్షుడు , అవార్డీ టీచర్స్ అసోసియేషన్-ఆంధ్రప్రదేశ్, 15-113 విద్యానగర్,సాయిబాబా గుడి వద్ద,ఏలూరు ,ప.గో.జిల్లా. 9441756213

 6. చాలా సంతోషం. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పెద్ద దిక్కైతే, శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీ వీ పూర్ణచంద్ గార్లు నిత్య కృషీవలురు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఈ నలుగురూ నాలుగు మూల స్తంభాలు.
  అద్భుతంగా నిర్వహించిన మీ సభల్లో చాలా సభలలో నేను పాల్గొనడం నా అదృష్టం. ఈ స్వర్ణోత్సవ వేడుకలు ముందు జరిపిన సభలో వలే గొప్ప గా జరగాలని భగవంతుని ప్రార్ధిస్తూ, సభలకు తప్పకుండా హాజరౌతాను.ఆత్మీయులు పూర్ణచందు గారికి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
  శుభాకాంక్షలతో ….
  మీ శ్రీహరికోటి ,
  రాష్ట్ర అధ్యక్షుడు , అవార్డీ టీచర్స్ అసోసియేషన్-ఆంధ్రప్రదేశ్, 15-113 విద్యానగర్,సాయిబాబా గుడి వద్ద,ఏలూరు ,ప.గో.జిల్లా. 9441756213

 7. అభినందనలు అందచేస్తూ, స్వర్ణోత్సవాల లో పాలు పంచుకునేందుకు నాకు అవకాశం కలిగించే కోరుతూ,
  శుభాకాంక్షలందిస్తున్నాను.
  యు.వి.రత్నం

 8. కొఠారి వెంకటరత్నం. కవి.తెలుగు ఉపాధ్యాయులు. వి. కోట. చిత్తూరు జిల్లా.ఆంధ్రప్రదేశ్. says:

  తప్పకుండా వస్తాము సార్.గతంలో జరిగిన పలు కార్యక్రమాలలో మేము పాల్గొన్నాము. మాకు అవకాశం కలిగించాలి కోరుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap