41వ ‘ఎక్స్ రే’ కవితా అవార్డుల ప్రదానం

సమాజ మార్గ నిర్దేశకులు కవులు…. ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్

సమాజానికి ప్రతిబింబంగా అధ్భుత సాహిత్యాన్ని, సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ చక్కని కవిత్వాన్ని అందిస్తున్న నేటితరం కవులను అభినందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పూర్వపు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. డిశంబర్ 18, 2022, విజయవాడ, ఆదివారం సాయంత్రం కారల్ మార్క్స్ రోడ్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ జాతీయస్థాయిలో జరిగపిన 41వ కవితలు పోటీల్లో విజేతలకు 2021 ఎక్స్ రే అవార్డుల బహుకరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కవులకు అధ్యయనం చాలా ముఖ్యమని అధ్యయనం చేసినప్పుడే ఉత్తమ కవిత్వాన్ని మనం సృష్టించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కవులు ఊహ లోకంలో వ్యవహరింప చేసే విధంగా తమ రచనలు సాగించరాదని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మనం కృషిచేసే విధంగా తమ కవిత్వం ఉండాలని అభిలషించారు. తెలుగు భాష మధురిమలను నలుదిశలా వ్యాపింప చేసేలా కవులు కృషి చేయవలసిన ఆవశ్యకత ఉంది అని బుద్దప్రసాద్ అన్నారు.

Poetry Awardees with guest Buddaprasad Mandali

మరో ముఖ్య అతిథి పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ప్రసంగిస్తూ సాహిత్యం అట్టడుగు వర్గాల ప్రజలను చైతన్య పరుస్తూ అభివృద్ధి పథం వైపు నడిపించే విధంగా ఉండాలని కోరారు. సమాజంలో జరిగే అవినీతి అక్రమాలపై పోరాటంగా కవిత్వం ఉండాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎక్స్ రే అధ్యక్షులు కొల్లూరి ప్రసంగిస్తూ నాలుగు దశాబ్ధాలుగా నిర్వహిస్తున్న కవితల పోటీలలో విజేతలు అనేకమంది ప్రముఖ కవులుగా వెలుగొందడం ఆనందదాయకం అన్నారు. నాగార్జున కళాపరిషత్ (కొండపల్లి) అధ్యక్షులు దేవినేనా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రజాకళలు, సాహిత్యాన్ని స్వాగతించాలని అన్నారు. అనంతరం 2021 ఎక్స్ రే ప్రధాన అవార్డు గ్రహీతగా దాకరపు బాబురావు (తిరువూరు)కు 20000 నగదు, జ్ఞాపిక, శాలువాతో మండలి బుద్ధ ప్రసాద్, కైలే అనిల్ కుమార్ సత్కరించారు. ఉత్తమ కవిత అవార్డు గ్రహీతలుగా సింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు), ఘనపురం దేవేందర్ (నిజామాబాద్), అవ్వారు శ్రీధర్ బాబు (నెల్లూరు), చింతా అప్పలనాయుడు (చినగూడబ, విజయనగరం జిల్లా), శివకుమార్ పేరిశెట్ల (మైపడి), శాంత యోగి యోగానందా(తిరుపతి), మామిడి శెట్టి శ్రీనివాసరావు (దొడ్డిపట్ల), సాంబమూర్తి లండ (శ్రీకాకుళం) లను నగదు జ్ఞాపక శాలువాతో సత్కరించారు ఈ సమావేశంలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి,అన్నాబత్తుల సరాబంధిరావు, కవితా విశ్లేషకులు వంశీకృష్ణ అతిధులుగా పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి బి. ఆంజనేయరాజు, కోశాధికారి సిహెచ్.వి. సుబ్బయ్య, ఉపాధ్యక్షులు కందికొండ రవికిరణ్ పర్యవేక్షించారు. అనంతరం కవులు తమ ప్రతిస్పందన వినిపిస్తూ బహుమతి పొందిన కవితలను వినిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సమావేశ ప్రారంభంలో కుమారి సి. హెచ్. గాయిత్రి కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.

బి. ఆంజనేయ రాజు
(ప్రధాన కార్యదర్శి-ఎక్స్ రే)

SA: