భాషా, సంస్కృతులను కాపాడుకోవాలి-విజయబాబు

భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మన జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలం అని అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. బుదవారం సాయంత్రం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, కామ్రేడ్ జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన విజయబాబు ప్రసంగిస్తూ మనిషి జీవితంలో నేర్చుకునే మొదటి భాష మాతృభాష, తల్లి ఒడే బిడ్డకు తోలిబడి, మాతృభాష సహజంగా అబ్బుతుంది అన్నారు. అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాష ను కాపాడుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణ రావు ప్రసంగిస్తూ తొలి తెలుగు శాసనకర్త ముత్తురాజ ధనంజయుడు సేవలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా ముద్రింపచేసి, మాతృభాష వెలుగుకు కృషిచేస్తున్న పి.వి.ఎల్.ఎన్. రాజు, లక్ష్మీతులసి దంపతులు సేవలను ప్రస్తుతించారు. భారతదేశంలో లెక్కలేనన్ని భాషలు ఉన్నాయి, కానీ 22 భాషలనే రాజ్యాంగం గుర్తించిందన్నారు.

సభ ప్రారంభకులు ఎక్స్ రే అధ్యక్షులు కొల్లూరి ప్రసంగిస్తూ మనుగడ కోసం ఇతర భాషలు నేర్చకోవటం తప్పుకాదు, అయితే వాటి ప్రభావం మాతృభాష పై పడకుండా చూడాలి అన్నారు. తొలుత తొలి తెలుగు శాసనకర్త ధనంజయుడు ముత్తురాజ్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి, పూలు జల్లి నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ వెలగా జోషి మాతృభాష పరిరక్షణ కర్తవ్యాన్ని గుర్తించడానికే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరుపుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా తొలి తెలుగు దివ్వె తెలుగు మూలాల అధ్యయన సంఘం ద్వారా తెలుగు భాష అభ్యున్నతికి కృషిచేస్తున్న పి.వి.ఎల్.ఎన్. రాజు(అబ్బు), మాజీ కార్పోరేటర్ పిల్లి లక్ష్మీ తులసి దంపతులకు ఆత్మీయ సన్మానం జరిగింది. నగర ప్రముఖులు, ఇతరులు కూడా రాజు దంపతులను సత్తరించారు. పి విఎల్ ఎన్ రాజు, పిల్లి లక్ష్మీతులసి సత్కార అనంతరం ప్రసంగిస్తూ మరుగున పడిన తొలి తెలుగు శాసనకర్త ఎరి(కల్) ముత్తురాజు ధనంజయుడు తొలి తెలుగు శాసనం గుర్తిస్తూ మాతృభాష పై క్రీ.శ.575 సంవత్సరంలక్రితం వారి సేవలను గుర్తించి ప్రజలకు తెలియజేస్తూ మాతృభాష వెలుగు కొరకు కృషి చేస్తాము అన్నారుజ్యోతి ప్రజ్వలన చేసిన అమృతహస్తం వ్యవస్థాపకులు దారా కరుణశ్రీ సమాజసేవ ద్వారా ఆత్మసంతృప్తి పొందవచ్చు అన్నారు. ఎన్. జి. ఓ. మాజీ రాష్ట్ర నాయకులు గుళ్లపల్లి నారాయణ రావు రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత సముద్రవేణి భక్తబృందం మహిళలచే మురళీ కోలాటం ఆహ్లాదపరిచింది. మహిళలు ఉత్సాహంగా, లయబద్దంగా కోలాటంలో నృత్యం చేసారు. గుణదల గంగిరెద్దుల దిబ్బ వారిచే *గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుని, అబ్బుర పరిచాయి. నాట్యకళారత్న భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందం తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తిస్తూ నృత్యంచేసారు. కళాకారులను జ్ఞాపిక, శాలువా లతో సత్కరించారు. మా టీవీ నారుమంచి ఆకర్షణీయమైన వ్యాఖ్యానంతో సభను నిర్వహించారు. సి.హెచ్.వి. సుబ్బయ్య, కందికొండ రవి కిరణ్, పొత్తూరి సీతారామారావు, బ్రహ్మదేశం వసంతకుమార్, గుర్రం ఏడుకొండలు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. విశేష సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వందన సమర్పణ కేసరి బి. ఆంజనేయ రాజు చివరిగా వందన సమర్పణ చేసారు.

బి. ఆంజనేయ రాజు (94410 42699)

SA:

View Comments (1)

  • ఈ వ్యాసం ప్రచురిచినందుకు *ధన్యవాదములు*
    మన భాష, సంస్కృతులపట్ల మీ శ్రధ్ధాశక్తులు ప్రశంసనీయం.