కవిత్వం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది – గౌరునాయుడు

(విజయవాడలో ఎక్స్ రే 42 వ. కవిత్వ పురస్కార ప్రదానం)

జీవితంలోని చీకటి, వెలుగులకు అక్షరరూపమే కవిత్వమని. ఉత్తమ కవిత్వం సజీవమైనదని ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు అన్నారు. శనివారం(14-10-23) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక నిర్వహణలో జాతీయస్థాయి కవితల పోటీ-2022 అవార్డుల బహుకరణ విజయవాడ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కవితలపోటీ న్యాయనిర్ణేతగా గంటేడ గౌరునాయుడు ప్రసంగిస్తూ వచనమైనా, పద్యమైనా అందులో కవిత్వం లేకపోతే ఎవరినీ ఆకర్షించదని, కవిత్వం జీవధాతువులాగా ఉండాలని అన్నారు. ప్రసంగం కొనసాగిస్తూ ఏ ప్రక్రియయైనా ప్రజలు నెత్తిమీద పెట్టుకున్నా, నేలకు విసరి కొట్టినా ఆయా కవులే కారణం అన్నారు. వర్ధమాన కవులు మంచి పరిపక్వతగా కవిత్వం వ్రాస్తున్నారని అన్నారు. దివంగత ప్రముఖ పద్యకవి పువ్వాడ తిక్కన సోమయాజి కుమారులు శివరామ విట్టల్, వేణుగోపాల్ సభను ప్రారంభిస్తూ తమ తండ్రి వలే సాహితీ సృజన చేయలేము కాని సాహితీ సేవ ఎల్లవేళలా అందించగలమన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక సంపాదకులు కొల్లూరి ప్రసంగిస్తూ కవికి సామాజిక స్పృహ, అధ్యయనం అవసరం అన్నారు. కొల్లూరి ప్రసంగిస్తూ గత 42 సంవత్సరాలుగా కవిత్వంలో పోటీలు నిర్వహిస్తూ కవులు సాహితీ ప్రతిభ మెరుగుపరుస్తున్నామన్నారు. అనంతరం జాతీయ కవితల పోటీలు 2022 ఎక్స్ రే అవార్డుల ప్రధానంలో బాగంగా తిరుపతి జిల్లా నల్లిరెడ్డిపాలెంకు చెందిన నల్లు రమేష్ కు 12000 నగదు, జ్ఞాపిక, శాలువాతో మరియు సాంబమూర్తి, ఓంకులూరు), బి. కళాగోపాల్(నిజామాబాద్), పొత్తూరి సీతారామారావు(కాకినాడ), అవ్వారు శ్రీధర్ బాబు(నెల్లూరు), శిఖా ఆకాష్(నూజివీడు), తూపులి రవీంద్రబాబు (విజయవాడ), కొంపెల్ల కామేశ్వరరావు (హైదరాబాదు), తిరువాయపాటి రాజగోపాల్(తిరుపతి), పద్మ సుధామణి (నాయుడుపేట) నగదు, జ్ఞాపిక, శాలువాతో వేదికపై ఉన్న అతిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం కవులు తమ ప్రతి స్పందన, బహుమతి కవితలను వినిపించారు. సభలో వాకర్స్ గవర్నర్ డి.వి.ఎస్. రామలింగరాజు తెలుగు భాష అభ్యున్నతికి మనం అందరూ కృషిచేయాలి అన్నారు న్యాయనిర్ణేత, ఉత్తరాంధ్ర కవి గంటేడ గౌరునాయుడు కవితలను సమీక్షించారు. ఎక్స్ రే కార్యదర్శి బోడి ఆంజనేయ రాజు, ఉపాధ్యక్షులు కందికొండ రవికిరణ్, సి. హెచ్.వి. సుబ్బయ్య, పొత్తూరి సీతారామారావు, బ్రహ్మదేశం వసంతకుమార్, అల్లూరి సత్యశ్రీనివాస రాజు, చలపాటి సురేష్, కొండాయగుంట రాము, గుర్రం ఏడుకొండలు కార్యక్రమ పర్యవేక్షణ చేసారు. నగరంలోని అనేక మంది సాహితీ ప్రముఖులు విచ్చేసారు. సభలో ఇటీవల మరణించిన గద్దర్ కు నివాళిగా మౌనం పాటించారు.

బి. ఆంజనేయరాజు (కార్యదర్శి, ఎక్స్ రే)

SA:

View Comments (1)