ఎక్స్ రే 2021 సంవత్సరపు ఎక్స్ రే జాతీయ స్థాయి అవార్డు తిరువూరుకు చెందిన కవి దాకరపు బాబూరావు రచన “దయచేసి అతణ్ణి గెలిపిద్దాం”కి లభించింది. అవార్డు కు గాను విజేతకు పది వేల నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. సాహిత్యప్రియులు, కవులు, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డు నిర్వహణ ఈ సంవత్సరంతో నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రధాన అవార్డుతోపాటు మరో పది మందికి ఉత్తమ కవితా పురస్కారాలు కూడా ప్రకటించారు.
ఈ సంవత్సరం ఉత్తమ కవితా పురస్కారాలు సింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు) “ప్రళయాన్ని దాటి ప్రశాంతం రావాలి”, ఘనాపురం దేవేందర్ (నిజామాబాద్) “చేతి వేళ్ళు”, అవ్వారు శ్రీధర్ బాబు (నెల్లూరు) “లాటరీ తగలని ఉదయాలు”, చింతా అప్పలనాయుడు (చినగుడబ గ్రామం) “అరి సేతిల బువ్వపువ్వు”, శివకుమార్ పేరిసెట్ల (మైపాడు గ్రామం) “ఇత్తడి లోటా”, శాంత యోగి యోగానంద (తిరుపతి) “ఆదివాసి ప్రశ్న”, మామిడిశెట్టి శ్రీనివాసరావు (దొడ్డిపట్ల గ్రామం) “ధిక్కార స్వరాలు”, సాంబమూర్తి లండా (శ్రీకాకుళం) “సమాంతర రేఖలు”, శివ శిఖ (ఉందవల్లి) “తప్పిపోయిన నది”, గుర్రాల రమణయ్య (నెల్లూరు) “గుండెతడి” అందుకోనున్నారు. 2021 ఎక్స్ రే అవార్డు నిమిత్తం పోటీకి 366 కవితలు వచ్చాయి. ప్రముఖ సాహితీవేత్త, అరసం అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారని ఎక్స్ రే అధ్యక్షులు కొల్లూరి తెలియజేశారు.
విజేతలకు అభినందనలు