కరీంనగర్ కు చెందిన నామని సుజనాదేవి కవిత కు ‘ఎక్స్ రే’ ప్రధాన అవార్డు లభించినది. విజేతకు పది వేల నగదు, జ్ఞాపిక అందించి సత్కరించనున్నారు. 43 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతీయ కవితల పోటీల్లో మరో పది ఉత్తమ కవితలుగా ఎంపిక చేసారు.
ఉత్తమ కవితా పురస్కారాలకు ఎంపికైన కవితలు:
కె. అప్పల రాజు(అనకాపల్లి) ‘వాడూ, నేనూ కవితకు’, చొక్కర తాతారావు(విశాఖ) భూగోళమంత దుఃఖాన్ని మోస్తూ, ఎన్. లహరి(హైదరాబాదు), అంతులేని వేదన, డాక్టర్ రాధశ్రీ(హైదరాబాదు) ‘నాకు దేవుడు కనిపించాడు’, రేపాక రఘునందన్ (తిరువూరు) మా ఊరి గొడుగై, వెంకు సనాతని(బాపట్ల) అందాక సెలవు, పొత్తూరి సీతారామరాజు(కాకినాడ) నాన్నకు, నాకూ మధ్య ఓ స్పర్శ, కమలేష్(శంకరపల్లి, రంగారెడ్డి జిల్లా) నాగలి సామి, నెల్లుట్ల రమాదేవి(స్టేషన్ ఘనాపూర్) అశ్రువర్ణం, జగన్నాధం రామమోహన్(కొత్తూరు, నెల్లూరు జిల్లా) మా లెక్కెక్కడ కవితకు.
ఈ అవార్డు ఎంపికకు న్యాయనిర్ణేతగా ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ మంగారి రాజేందర్(జింభో) వ్యవహరించారు.
త్వరలో విజయవాడలో జరిగే ప్రత్యేకసభ లో వీరికి బహుమతి ప్రదానం జరుగుతుందని ‘ఎక్స్ రే’ అధ్యక్షులు కొల్లూరి తెలిపారు.
మీ సేవలకు *వందనం*