ఈ నెల 7వ తేదీ సాయంత్రం గం. 6.30 ని.లకు హైదరాబాద్ రవీంద్రభారతిలో.
‘మందుల మహామాంత్రికుడు’ యల్లాప్రగడ సుబ్బారావు జీవితంపై
ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి‘ నాటకం
ప్రపంచం గర్వించదగ్గ తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ఐదువేల సంవత్సరాల్లో… ఆయన కనిపెట్టినన్ని ఔషధాలు, ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆయనను ‘మందుల మహామాంత్రికుడు’ అంటారు. నోబెల్ బహుమతి రావాల్సిన వ్యక్తి. పెన్సిలిన్ కంటే ప్రభావవంతమైన యాంటీ బయోటెక్ ‘క్లోరో టెట్రా సైక్లిన్’ను ఆవిష్కరించినది ఆయనే. అలాగే, ఫ్లోరిక్ యాసిడ్ ను కనిపెట్టారు. కీమోథెరపీకి పునాది వేసిన మెడిసిన్ ‘మేథో ట్రెక్సీట్’ను, బోధకాలును నివారించే ‘పెట్రాజెన్’ను ఆయనే కనిపెట్టారు. ఒక్కటని కాదు… మలేరియా, ఫైలేరియా, ప్లేగు, క్యాన్సర్, ఎనీమియా, హృద్రోగ సమస్యలు – ఎన్నో వ్యాధులకు ఔషధాలు కనిపెట్టిన మహానుభావుడు యల్లాప్రగడ సుబ్బారావు. అయితే, ఆయన గురించి చాలామందికి తెలియదు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలని, ఎవరూ మర్చిపోకూడదని ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఓ నాటకం రచించారు.
కాలేజీలో చదివే రోజుల నుంచి సింగీతం శ్రీనివాసరావుకు యల్లాప్రగడ సుబ్బారావు అంటే అమితాసక్తి. ఎప్పటికైనా యల్లాప్రగడ బయోపిక్ తీయాలనేది సింగీతం యాంబిషన్. అమెరికాలో ప్రజలకు సీవీ రామన్, శ్రీనివాస రామానుజమ్ గురించి తెలుసు. కానీ, యల్లాప్రగడ గురించి తెలియదు. అందుకని, అమెరికాలోని యూనివర్సిటీల్లో ప్రదర్శించడానికి, అక్కడి తెలుగు ప్రజలు అందరూ యల్లాప్రగడ గురించి తెలుసుకోవాలని ఆయనపై ఇంగ్లిష్ లో ఏడెనిమిదేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు ఓ నాటకం రాశారు. మన దేశంలోని తెలుగు ప్రజలు చాలామందికి ఆయన గురించి తెలియదనే ఉద్దేశంతో ‘అజ్ఞాత యశస్వి’ పేరుతో ఆ నాటకాన్ని డాక్టర్ రామ్ మోహన్ హోళగుండి తెలుగులో అనువదించి, దర్శకత్వం వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ – తెలంగాణ, నిషుంబిత సమర్పణలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం గం. 6.30 ని.లకు రవీంద్రభారతిలో నాటకాన్ని ప్రదర్శించనున్నారు. అందరూ ఆహ్వానితులే.
సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ “
నా కాలేజీ రోజుల నుంచి యల్లాప్రగడ బయోపిక్ తీయాలనేది నా యాంబిషన్. ఆయనకు సంబంధించిన కంటెంట్ నా దగ్గర బోల్డంత ఉంది. ఆయన బయోపిక్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రేట్ బయోపిక్ అవుతుంది. మన వాళ్లకి మన చరిత్ర తెలియాలనే ఈ నాటకం రాశా” అని అన్నారు.
-కళాసాగర్
This is to let you know that Mrs Shobha Shankar, the most familiar Telugu TV news presenter is the daughter of Sri Yellapragada Satyanaraya,the immediate brother of late Dr YSR. She is in Hyderabad now. Her contact no is 9866494418. You may contact her and know more on Dr YSR.- Sanku.