వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానం

గుంటూరు బృందావన్ గార్డెన్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళా వేదికగా సాంస్కృతిక బందు సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావాహిని ఆధ్వర్యంలో స్వర్గీయ వై.కే. నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం(15-05-22) సాయంత్రం వైకె నాగేశ్వరరావు స్మారక పురస్కార ప్రధానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు డోక్కా మాణిక్యవరప్రసాద్, విశిష్ట అతిధులుగా శారద కళాసమితి అధ్యక్షులు జోగివర్తి శంకరరావు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షులు రామరాజు శ్రీనివాసరావు, సీనియర్ సిటిజన్స్ నాయకులు నూతలపాటి తిరుపతయ్య, ఆత్మీయ అతిధులుగా కళాభూషణ బి. వేదయ్య, నటులు, దర్శకులు కావూరి సత్యనారాయణ, నటులు డాక్టర్ నరాలశెట్టి రవికుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య పాల్గొని వివిధ రంగాల్లోని కళాకారులు, కళాదర్బార్ అధ్యక్షులు కళాసామ్రాట్ పొత్తూరి రంగారావు, రంగస్థల నటుడు, దర్శకుడు, ఉపాధ్యాయులు నడింపల్లి హనుమంతరావు, సాహితీవేత్త తెలుగు విభాగాధిపతి, హిందూ కళాశాల డాక్టర్ ఎలా ప్రగడ మల్లికార్జునరావు, ఎన్టీఆర్ ఎన్నార్ బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీత ఆచంట బాలాజీ నాయుడు, ప్రముఖ అంతర్జాతీయ నటులు ఏ. కోటేశ్వరరావులను ప్రశంసిస్తూ వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధి వివిధ రంగాల్లో నిష్ణాతులైన సన్మాన గ్రహీతలను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న యువకళావాహిని వారిని ప్రత్యేకంగా అభినందించారు. తొలుత ఉదయం 11 గంటలకు శ్రీపద్మావతి కళావేదికగా ఆలాపన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంగీత విభావరి మధురగీతాలతో సాగింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆచంట జాలాజీ నాయుడు చే దుర్యోధనుడు ఏకపాత్రాభినయం, సభానంతరం అర్జునుడిగా నిమ్మగడ్డ సుగ్రీవుడు, కృష్ణుడిగా ఏ.వి.కోటేశ్వరరావులచే గయోపాఖ్యానం యుద్ధ ఘట్టం కళాభిమానులను అలరించింది. తొలుత కార్యక్రమాలను అతిథులు, సంస్థ వారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉపాధ్యక్షులు బొప్పన నరసింహరావు, భాగి శివశంకరశాస్త్రి, ప్రధాన కార్యదర్శి జి. మల్లికార్జునరావు, లయన్ ఎం.ఎ.హమీద్, జివిజి శంకర్ మరియు కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు.

SA: