శ్రీమతి రేష్మ జెల్లీ గారు, భవానీపురం, విజయవాడ.
గృహిణి, అయితేనేమి మంచి చిత్రకారిణి. చిన్నప్పటి నుండి నుండి బొమ్మలు అంటే ఇష్టం. సమాజానికి కళాకారిణిగానే పరిచయమవ్వాలి. కళాకారిణిగానే రాణించాలనే సంకల్పంతో మహిళలు అరుదుగా రాణించే చిత్రకళారంగంలో అడుగిడి కాన్వాస్ పై తన ఊహలకు చిత్ర రూపం కల్పిస్తున్నారు రేష్మ.
బ్యాచలర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్., మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హెచ్.ఆర్ & మార్కెటింగ్)., బ్యాచలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లైడ్ ఆర్ట్స్ & మోడరన్ ఆర్ట్) లను పూర్తి చేసారు.
పోర్ట్రయిట్స్, అబ్ స్ట్రాక్, అక్రిలిక్, రియల్స్టిక్ వర్క్స్, తంజావూర్ ఆర్ట్స్, లెదర్ & గ్లాస్ వర్క్స్ మరియు నైఫ్ పేయింటింగ్స్ మొదలగు వాటిల్లో ప్రవేశం వున్న ఆర్టిస్టుగా రాణిస్తున్న రేష్మ ఆర్ట్ క్యాంపులలోను, సెమినార్ లోను, 10-15 గ్రూప్ షోలులోను, 3 సార్లు సోలోగా ప్రదర్శనలను ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలతోపాటు, USA లో ఏర్పాటు చేసానని తెలిపారు. ఒకప్పటి ఇండియా ప్రెసిడెంట్ శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి చేతులమీదుగా అవార్డును అందుకోవడం విశేషం. అలాగే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల గవర్నర్ లనుండి ప్రశంసలు పొందడం, నాకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పడం జరిగింది.
చికాగోలోని క్రిటేరియా ఫైన్ ఆర్ట్స్ గ్యాలరీలోను, హైదరాబాద్ లో గల చిత్రమయి ఫైన్ ఆర్ట్స్ స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీ, ఆకృతి ఆర్ట్స్ గ్యాలరీను, మరియు విజయవాడలో అనేక చోట్ల కళాప్రదర్శనలను ఏర్పాటుచేయడం జరిగిందని వివరించారు. రమారమి మొత్తం వందకు పైగానే పేయింటింగ్స్ లను చిత్రిస్తే, అందులో ముప్పై పేయింటింగులను అమ్ముడయ్యాయని రేష్మ తెలిపారు. ఈరోజుకి ఈ స్థాయికి ఎదగటానికి మొదటినుండి తల్లితండ్రులు బాగా ప్రోత్సహించారు. అదే స్థాయిలో పెళ్ళి అయిన తర్వాత కూడా భర్త శివప్రసాద్ ప్రోత్సాహాన్నిచ్చారని, అందుకు ఈ కళారంగంలో తనకంటూ ఓ స్థాయిలో వుండాలని, అదే తన ఆశయమని తెలిపింది రేష్మ. అంతేకాదు తనకు ఓ ఆర్ట్ స్టూడియోను దుర్గా రెసెడెన్సీ, సీతారామపురం, అనిల్ ఎస్టేట్స్ దగ్గర, విజయవాడలో ఉందని కూడా తెలిపింది.
చివరిగా “ఆర్ట్ అంటే ఇష్టం కాబట్టీ, దీన్ని వదలకుండా, కంటిన్యూ చేయాలని, ఈ ఆర్ట్ ద్వారా ప్రతి చిత్రం లో, ప్రతి ఫ్రేమ్ లో ఎదుటి వారికి ఓ సందేశం ఉండేలా వెయ్యాలని ఆలోచన, ఆశయంమని రేష్మ జెల్లీ చెప్పడం జరిగింది.
డా. దార్ల నాగేశ్వర రావు