
ప్రముఖ యువ చిత్రకారుడు, ముఫై ఏడేళ్ళ తాడోజు కిరణ్ ఈ రోజు(8-02-22) రాజమండ్రి లో అశువులుబాశాడు. కిరణ్ గత కొన్నేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కళలకు, కళాకారులకు ప్రసిద్ది చెందిన రాజమండ్రి లో కళాకారుల కుటుంబంలో పుట్టిన తాడోజు కిరణ్ అనతి కాలంలోనే చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో భవిష్యత్ వున్న కిరణ్ ఆకస్మిక మరణం ఆయన కుటుంభానికే కాదు, చిత్రకళా రంగానికి కూడా తీరని లోటని కళాకారులందరూ తమ సంతాపాన్ని తెలియ జేశారు. మరో ప్రముఖ యువ చిత్రకారుడు హరి తాడోజు కిరణ్ కు స్వయానా తమ్ముడే.
తాడోజు కిరణ్ అకాల మరణానికి చింతిస్తూ, వారి కుటుంబ సభ్యులకు 64కళలు పత్రిక ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తుంది.

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

నేను మెచ్చిన చిత్రకారుడు
నాకు నచ్చిన నేను మెచ్చిన చిత్రకారుడు తాడోజు కిరణ్ (రాజమండ్రి) కోనసీమ చిత్రకళా పరిషత్ లో ఎన్నో అత్యుత్తమ బహుమతులు అందుకొన్న కిరణ్ పైన ఎన్నో ఆశలు… అంచనాలతో రాబోయే కాలానికి కాబోయే గొప్ప చిత్రకారుడు కాగలడని… ప్రముఖ కళాకారులచే కీర్తింపబడే, వినయ విధేయతలతో… అందరిలో ఒక్కడిగా కీర్తి గడించిన మా కిరణ్ తిరిగిరాని లోకాలకు వెళ్లాడనే వార్త నన్నే కాకుండా యావత్ చిత్రకళా రంగాన్ని దిగ్భ్రాంతి పరిచింది మన కోనసీమ చిత్రకళా పరిషత్ మరియు మన అందరి తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.. వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ…
కొరసాల సీతారామస్వామి
(కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం)