నక్కా ఇళయరాజా కి చిన్నప్పటి నుండి బొమ్మలు, కార్టూన్లు అంటే ఇష్టం. తల్లిదండ్రులు డా.నక్కా విజయరామరాజు, డా. నందిని పేరొందిన డాక్టర్లు. తమ్ముడు భరత్ రాజా. పుట్టింది గుంటూరు జిల్లా నరసరావుపేటలో, నివాసం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో.
ఇప్పటివరకు 350 కు పైగా కార్టూన్స్, కొన్నిబొమ్మలు వేసాడు, వీటిలో కొన్ని నవ్య వీక్లి, గోతెలుగు.కాం లో ప్రచురింపబడ్డాయి. చిన్నప్పటినుండి బొమ్మలు గీయడం అంటే ఆసక్తి, క్లాస్ నోట్ బుక్స్ వెనుక బొమ్మలు వేసేవాడు. రాజా ఐదేళ్లు ఉన్నప్పుడు సంగతి. వారు అద్దెకుండే యింటి గోడలమీద, తలుపుల మీద రంగు పెన్సిల్స్ తో బొమ్మలేసే వాడు. ఓసారి యింటి ఓనరొచ్చి అవి చూసి ఇల్లంతా ఖరాబు చేసేడని రుసరుసలాడే సరికి బాగా ఏడ్చాడు. కొంతకాలానికి ఆ యింటినే వాళ్ళు కొన్నారు. అప్పుడు” నేను గోడలనిండా ఇష్టమొచ్చినన్ని బొమ్మలేసుకోవచ్చు కదా డాడీ! యింకా నన్నెవరేం అనరు” అన్నాడు వెలిగేపోయే ముఖంతో. పుట్టుకతో తనకు కల్గిన నష్టానికి కృంగిపోకుండా, తనలోని సృజనాత్మక ఆలోచనలకు కార్టూన్ కళ ద్వారా దృశ్యరూపం కల్పిస్తున్నాడు. 2014లో నవ్య వీక్లీ లో మొదటి కార్టూన్ ప్రింట్ అయ్యింది. రెండేళ్ల క్రిందట హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ కార్టూనిస్టుల ఎక్సిబిషన్ లో పాల్గొన్నాడు. త్వరలో ‘కిడ్డుస్ టూన్స్’ పేరిట బుక్ గా రాబోతుంది, ఆ పుస్తకంలో మహిళల ఆత్మరక్షణ పద్ధతుల పై “నిర్భయ’ అనే కామిక్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణ. తన కార్టూన్లలో జాతీయ, అంతర్జాతీయ విషయాలపై చక్కటి అవగాహన తో ఎప్పటికప్పుడూ కార్టూన్లు గీస్తుంటాడు.
ఇళయరాజా కి బాపుగారంటే వీరాభిమానం. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ బాబుగారి కార్టూన్స్ స్ఫూర్తి. రాజా బొమ్మలు కార్టూన్స్ చూసిన బాపుగారు రాజాని చూడ్డానికి 2013 డిసెంబర్ 15 న(ఆ రోజు బాపుగారి బర్త్ డే) వచ్చి అభినందించారు. కుటుంబమంతా కల్సి బాపుగారి బర్త్ డే సెలెబ్రెట్ చేసుకున్నారు.
-కళాసాగర్
illayaraja ne cartoons chalabagunai .
ఇళయరాజా గారి గురించి బాగా రాశారు