ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తర్వాత డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప లో ప్రారంబించారు. దీనితో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేయాలనుకునే కోస్తా అంధ్రా, రాయలసీమ వాసుల కల నెలవేరనుంది.
డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, కడప నాలుగు సంవత్సరాల బి.ఎఫ్.ఏ. అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ మరియు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్స్ లకి 2020-21 సంవత్సరానికి Art & Design Common Entrance Test (ADCET-2020) నోటిఫికేషన్ విడుదలయింది.
– నేటి నుంచి ధరఖాస్తుల స్వీకరణ – జనవరి 30తో ముగియనున్న గడువు
– ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 2 వరకు అవకాశం.
– ఫిబ్రవరి 10న ఎంట్రన్స్ టెస్ట్
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ . జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా డా. వై.ఎస్ .ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ గా కడప లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన లో భాగం గా 10 వ షెడ్యూల్ అనుసరించి జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ అర్స్ట్ యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి సవరణ చేసి స్టేట్ యూనివర్సిటీగా వై.ఎస్. ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. విజయ కిషోర్ తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో 5 ప్రత్యేక విభాగం లు ఉన్నట్లు వెల్లడించారు. విద్యార్ధుల అభిరుచి మేరకు వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విభాగాలలో BFA – పెయింటింగ్, BFA SCULPTURE (శిల్పం) , BFA – అప్లైడ్ ఆర్ట్స్ , BFA యానిమేషన్ , BFA ఫోటోగ్రఫీ. ఈ కోర్సు ల అడ్మిషన్లు లో భాగం గా ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ADCET) నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనికి సంభందిచిన నోటిఫికేషన్ జనవరి 16 న విడుదల చేసినట్లు వెల్లడించారు. ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ను ఫిబ్రవరి 10 వ తేదీ న నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 12 న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలియజేశారు. విద్యార్ధులకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యం తో 4 సంవత్సరాల బ్యాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్(బి.ఎఫ్.ఏ ) కోర్సు లను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
కోర్సుల వివరాలు :
1. B. F. A పెయింటింగ్ – 40 సీట్లు
2. BFA అప్లైడ్ ఆర్ట్స్ – 40 సీట్లు
3. BFA శిల్పం – 40 సీట్లు
4. BFA యానిమేషన్ – 60 సీట్లు
5. BFA ఫోటోగ్రఫీ – 40 సీట్లు
6. B. Des ( Design) – 60 సీట్లు
నోటిఫికేషన్ వెలువడిన తేదీ : 16 – 01 – 2021
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 30 – 01 – 2021
ఆలస్య రుసుము తో చివరి తేదీ : 02 – 02 – 2021
ఎంట్రన్స్ టెస్ట్ : 1 – .02 – 2021
ఫలితాల వెల్లడి : 12 – 02 – 2021
http://sche.ap.gov.in/ADCET or http://www.ysrafu.ac.in ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు.
100 మార్కులకు ONLINE TEST నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎపిలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా హైదరాబాద్ లో కూడా విద్యార్ధులు ప్రవేశ పరీక్ష వ్రాసే అవకాశం ఉందని తెలియజేశారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది గా విజ్ఞప్తి చేశారు.
Fine Arts and Design Courses Admission Notification:
BFA/B.Design Programs at Dr.YSR ARCHITECRE AND FINE ARTS UNIVERSITY, KADAPA, AP., Inviting online applications for 4 Year’s BFA (Applied Art, Painting, Sculpture, Animation and Photography) B.Design (Interior Design) 4 Year’s Courses. https://sche.ap.gov.in/ADCET or www.ysrafu.ac.in, Last date 30-01-2021 & online test on 10-02-2021, phone number : 96184 38419. Interested Students may apply below the Courses.