వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ

ఎంతో ఘనంగా ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్ట్ 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఒక రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

అసలు ఈ అవార్డులు 2020 సంవత్సరంలో సెలెక్ట్ చేసినవి. ఇప్పటికే కాలాతీతమయ్యింది. అవార్డు గ్రహీతల్లో కారా మాస్టారు లాంటి కొంతమంది పెద్దలు కన్నుమూశారు. కాబట్టి ఇకనయినా కార్యక్రమాన్ని తొందరగా నిర్వహిస్తే బావుంటుంది. అవార్డు గ్రహీతతో పాటు ఒకరిని అనుమతిస్తే 140 మందితో కార్యక్రమం చేయొచ్చు. మొత్తం 64 మందికి ఈ అవార్డులు ప్రకటిచారు.

ఈ పురస్కారాన్ని గౌరవంగా తిరస్కరిస్తున్నట్లు పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ , తెలకపల్లి రవి ప్రకటించారు.

-కళాసాగర్

SA: