యువ కళావాహిని రంగస్థల పురస్కారాలు

సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 29-03-21, సోమవారం సాయంత్రం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళా వేదిక పై యువ కళావాహిని సాంస్కృతికోత్సవం, యువ కళావాహిని రంగస్థల పురస్కారాల ప్రదానం ఘనంగా నిర్వహించారు.శ్రీ ఘంటా పున్నారావు ముఖ్య అతిథిగా,శ్రీ మన్నవ సుబ్బారావు సభాధ్యక్షులుగా, శ్రీ సిహెచ్ మస్తానయ్య ఆత్మీయ అతిథి గా డా. లంక లక్ష్మీనారాయణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ యడ్ల గోపాలరావు గారిని సన్మానించారు. 2020 సంవత్సరానికి రంగస్థల పురస్కారాలు అందుకున్న వారు తులసి బాలకృష్ణ, శివశంకర్ శాస్త్రి, ఆదినారాయణరావు, గరికపాటి కాలిదాసు, హరిబాబు, డి.ఎల్. కాంతారావు గార్లకు, 2021 సంవత్సరానికి ఎన్.ఎస్. నారాయణబాబు, టి. లక్ష్మి, యడ్ల గోపాలరావు, రాజర్షి, గంగోత్రి సాయి, జానీ భాషా గార్లకు గురజాడ, బళ్ళారి రాఘవ, రఘురామయ్య, సి.ఎస్. ఆర్., గరికపాటి రాజారావు, వనారస గోవిందరావు రంగస్థల పురస్కారాలు  అందజేసారు. అనతరం ‘మనసుతో ఆలోచిస్తే’ నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు సమర్పించారు.లయన్ వై కె నాగేశ్వరరావు,లయన్ బొప్పన నరసింహారావు పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

SA: