యూట్యూబ్ లో చిత్రకళ కోసం ప్రత్యేక ఛానల్

గుగూల్ తర్వాత పాపులర్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న స్టార్ మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా? శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం. గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పింస్తుంది. ఎంతో మందిని స్టార్స్ ని చేసింది. కొంతమంది స్టార్స్ ని కూడా యూట్యూబర్స్ ని చేసింది.

తమ ప్రతిభను, అభిరుచులను అందులో తమకున్న అనుభవాలను వీడియోలుగా రూపొందించి యూట్యూబ్ ద్వారా వారికున్న ప్రతిభాపాఠవాలను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ తద్వారా ఆదాయం తెలుగు యూట్యూబర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సృజనాత్మకంగా ఆలోచించాలే కాని ఉపాధికి కాదేది అనర్హం అంటున్నారు నేటితరం. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఎవరో ఇవ్వాలి అనేవారు, కాని, నేడు తమ అభిరుచులే ఉపాధిగా వారే సృష్టించుకుంటున్నారు. టెక్నాలజీ పైన అవగాహన పెంచుకొని, అభిరుచికి సృజననల జతచేసి యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు వేదికగా మార్చుకుంటున్నారు.

ఈ ఛానల్ లో విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, వంటలు, మొక్కల పెంపకం, సంగీతం, గానం, చిత్రలేఖనం, పెయింటింగ్ ఇలా ఒకటేమిటి సకల కళల సమాహారమే… యూట్యూబ్ (YouTube).

అనేక చిత్రకళా పోటీలలోనూ, వర్క్ షాప్ లోనూ పాల్గొంటూ మంచి చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిత్రకారుడు వై.వి. సత్యనారాయణ. తనకు వచ్చిన విద్యను పదుగురికి పంచాలనే ఉద్దేశ్యంతో ‘YVS Arts’ పేరుతో ఛానల్ ప్రారంభించారు. వీరు రాజోలు తాలూకా లో ఒక పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్నారు.


ఇందులో పోర్ట్రైట్స్ డెమోలు, పిల్లలకు డ్రాయింగ్ పాఠాలు, తెలుగు లెటరింగ్ రాయడం లో మెళకువలు, వివిధ ప్రాంతాలలో జరిగే చిత్రకళా ప్రదర్శనలు వివరాలతో రెగ్లులర్ గా వీడియోలు చేస్తున్నారు. ఈ ఛానల్ కు ప్రస్తుతం 55 వేల మంది చందాదారులున్నారు. ఈ సంఖ్య తెలుగులో కళలలు సంబంధించినంత వరకు ఎక్కువనే చెప్పాలి. కాని వ్యూస్ ఎక్కువగా రాకపోవడం వలన పెద్దగా ఆదాయం రాకపోయినప్పటికీ పేషన్ తో ఛానల్ ను నడుపుతున్నారు.

తన ఛానల్ ను ఒకసారి చూడండి … నచ్చితే సబ్స్క్రైబ్ చేసి… ప్రోత్సహించండి.

ఈ క్రింది లింక్స్ లో వీడియోలు చూడండి…
https://www.youtube.com/watch?v=CTlvdRRIxKY
https://www.youtube.com/watch?v=gXI0IJJ30DA

2 thoughts on “యూట్యూబ్ లో చిత్రకళ కోసం ప్రత్యేక ఛానల్

  1. చాలా బాగా చెప్పారు సార్
    YVS గారికి అభినందనలు 💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap