మిత్రుడు ఫిజిక్స్ ఆరుణ్ కుమార్ కలం నుండి వెలువడిన మూడవ గ్రంధం జీరో గ్రావిటీ. ఇందులో రెండవ గ్రంధంగా వెలువడిన”బిగ్ బ్యాంగ్” వ్యాససంపుటి కాగా మొదటి గ్రంధం శూణ్యం, నేటి మూడవదైన జీరో గ్రావిటీ రెండు గ్రంధాలు కూడా కవితా సంకలనాలు.
అరుణ్ కుమార్ వృత్తి ఫిజిక్స్ బోధన. భౌతిక శాస్త అధ్యాపణం. కవిత్వం అనేది ఊహ మరియు తాత్వికత లపై ఆదారపడినటువంటిది. అందుకు సున్నితం మరియు సునిసితమైన మనసు @బావుకత కావాలి. అప్పుడే ఆలోచనలు కవితాత్మకంగా అక్షర రూపం దాల్చుకుంటాయి. కానీ ఫిజిక్స్ భౌతిక శాస్త్రం అందుకు పూర్తిభిన్నమైనది. ఇక్కడ ఊహజనితమైన అంశాలకు తావుండదు. పూర్తిగా వాస్తవిషయానికే ఇక్కడ చోటు ఉంటుంది. కల్పనను అంగీకరించదు, మరి వాస్తవాలను మాత్రమే అంగీకరించే వృత్తిలో ఉన్న అరుణ్ కుమార్ దానికి పూర్తి విరుద్ధమైన కల్పనతో కూడిన సాహిత్యరంగాన కూడా రానిస్తున్నాడు అంటే అతనిలో మెటీరయలిస్టిక్ భౌతిక శాస్త బోధకుడుతో పాటు సున్నిత స్వభావుడైన కవి కూడా దాగి ఉన్నాడని భావించాలి. అందుకే అతని కవిత్వంలో ఈ రెండు రకాల చాయలు కూడా మనకు కనిపిస్తాయి.
ఈ కవితా సంకలనం లో మొత్తం 58 కవితలను పొందుపరచడం జరిగింది. వీటిలో పిక్షన్ నాన్ పిక్షన్ రెండిటీ కలయికతో రాసిన కవితలు మనల్ని అల్లరిస్తాయి ఆలోచింపజెస్తాయి.
ఇందులో పేర్కొన్న మొదటి దైన “నిత్యత్వ నియమం” అన్న కవిత లో తన కవితా లక్షణం గురించి చెబుతూ ఇలా అంటాడు.
నా కవిత్వం ఓ నిత్యత్వం
నా కలం ఓ విజ్ఞాన శరం
నా ఆలోచనల ముఖచిత్రమ్. శతాబ్దాల ఉదయ యానం. అనంత విశ్వ సేద్యం లో గేలాక్షీల సముదాయం అని పేర్కొంటాడు.
మరో కవిత లో నాన్న త్యాగాన్ని తన సైన్స్ పరిభాషకు అన్వయిస్తూ…
ఇలా రాస్తారు…
మానవ జీవిత గమనపు గణితంలో నాన్న ఎమోషన్స్ తో తడిసిన ఓ ఈక్వేషన్.
భాద్యతలను ప్లస్ చేస్తూ, కష్టాలను మైనస్ చేస్తూ చిరునవ్వుల లబ్దంతో తాను సున్నా శేషమై మిగులుతాడు…. ఈక్వాలిటీ పాలో అవుతూ మనకు “అనంతపు “భవిష్యత్ ను అందిస్తాడు అని
చెప్పిన తీరు నిజంగా అద్భుతం అనిపిస్తుంది.
తీరాన ఇసుక తిన్నెలపై
నా అడుగుల జాడను ప్రతిరోజు
సముద్రకెరటాలు ప్రశ్నిస్తున్నాయి. నీ గుండె కోవెల కోయిల ఎక్కడుందని..? జతగా నడక ‘ఒంటరిగా’ఎందుకయ్యిందని అంటూ పోడ్ కాస్ట్ అన్న కవితలో దూరమైన ప్రియురాలు గురించిన జ్ఞాపకాలను ఎంతో సున్నితంగా రాసిన తీరు చాలా గొప్పగా ఉంటుంది.
భూమండలాన్ని కబలిస్తున్న కాలుష్య తీవ్రత ను మరో కవితలో ఇలా చెప్తాడు.
“సూర్యుడేందుకో నిద్ర లేవడానికి చిన్న పిల్లాడిలా మారామ్ చేస్తూ తూర్పు తలుపులు తెరవడం లేదు.
బయటకు రావడానికే కాదు బ్రతకడానికే బయపడుతున్నాడు”
అంటాడు చామత్కారంగా.
ఈ గ్రంధం నందలి ప్రతి కవిత ఒక్కో ప్రత్యేకత కలిగి వుండ డమే గాకుండా ప్రతి కవిత కు చివర్లో
ఒక బాక్స్ లో పేర్కొన్న కొటేషన్స్ ఒక అదనపు ఆకర్షణగా కనిపిస్తాయి.
“ఫిజిక్స్ లో మేధమేటిక్స్ కు చెందిన పాలిటిక్స్ చదవాలనే లిరిక్స్‌కి రీడర్ నేను
నాలో నాకు లీడర్ నేను
ఏది ఏమైనా సార్ నేనే స్టార్ నేనే “
లాంటి కొటేషన్స్ ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ
134 పేజీలు, ప్రత్యేకంగా వెంటపల్లి రూపొందించిన అందమైన ముఖచిత్రంతో వెలువడిన ఈ గ్రంధం వెల. 180/- రూపాయలు దీనిని సొంతం చేసుకునేందుకు సంప్రదించవలసిన రచయిత ఫోన్ నెంబర్ : 9394749536.
–వెంటపల్లి సత్యనారాయణ
9491378313
